ఆ హీరోయిన్ తో నాగ చైతన్య ప్రేమాయణం…?

నాగచైతన్య – సమంత విడిపోయి ఎవరి జీవితాలను వారు ఒంటరిగా లీడ్ చేస్తున్నారు. ఈ మధ్య వీరి పెళ్లి వార్తలపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. పలానా హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నాడని…అలాగే సమంత కూడా ఓ హీరోతో రిలేషన్ లో ఉందని ఎప్పటికప్పుడు కొత్త, కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. కానీ వీటిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

విడాకులు తీసుకున్న నాగ చైతన్య- సమంతలు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఆలస్యం చేస్తే వయస్సు పైబడుతుంది. పిల్లల్ని కనాలన్న, వారి బాధ్యతలను చూసుకోవాలన్న సరైన సమయంలో పెళ్లి చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. 35ఏళ్ల వయస్సులో నాగచైతన్య – సమంత విడిపోవడంతో భవిష్యత్ దృష్ట్యా వెంటనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.

Advertisement

వీరి విడాకుల ప్రకటన తరువాత రెండో పెళ్లి వార్తపై ఎప్పటికప్పుడు , సరికొత్తగా వార్తలొచ్చాయి. నటి శోభిత ధూళిపాళ్ళతో చైతూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని ప్రచారం జరగగా…సమంత కూడా కుటుంబ సభ్యులు, స్నేహితుల ఒత్తిళ్ళ మేరకు రెండో పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరిగింది. అయితే శోభితతో ప్రేమాయణం వార్తలను నాగచైతన్య ఖండించారు. ఎవరో కావాలనే చేస్తోన్న ప్రచారమేనని చెప్పడంతో ఈ కథనాలకు ఫుల్ స్టాప్ పడింది.

Also Read : ఆ డైరక్టర్లు నన్ను వాడుకొని వదిలేశారు – పాయల్ సంచలన కామెంట్స్

Advertisement