‘ఆర్ఎక్స్.100 ‘ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ పాత్రలతో తనదైన గుర్తింపు పొందింది. ఈ సినిమాలో ఆమె నటన మరీ రెచ్చిపోయి నటించినట్లు అనిపిస్తోంది. లిప్ లాక్, బోల్డ్ సీన్స్ అబ్బో…ఆదరగోట్టేసింది. చాలామందిని థియేటర్లలో కూర్చోబెట్టింది కూడా. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంది
ఈ సినిమా తరువాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ ‘జిన్నా’ ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలో నటించే అవకాశం వరించింది కానీ ఈ సినిమాలో ఆమెను గ్లామర్ పాత్రల కోసమే తీసుకున్నారేమో అనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇటీవల పాయల్ కామెంట్స్ చేసింది. కొంతమంది డైరక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
నేను చేసే ప్రతి సినిమా సక్సెస్ అయ్యేందుకు పూర్తి ఎఫర్ట్స్ పెడుతుంటాను. కానీ రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు అది అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ‘ఆర్.ఎక్స్.100 ‘ తో నాకు మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆ తరువాత కొంతమంది డైరక్టర్లు నన్ను మిస్ లీడ్ చేశారు. నన్ను వాడుకున్నారు. అప్పుడు నాకేం తెలియదు. కొంచెం మెచ్యూరిటీ పెరిగింది.
తనను డైరక్టర్లు మోసం చేశారని, నన్ను వాడుకొని వదిలేశారని చెప్పింది కానీ వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు పాయల్. కానీ ఈ భామ చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. పాయల్ ను వాడుకొని వదిలేసిన డైరక్టర్లు ఎవరూ అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
Also Read : కదులుతున్న బస్సులోనే కండక్టర్ శృంగారం – వీడియో తీసిన ప్యాసింజర్లు..!!