ఈటల రాజేందర్ కు మళ్ళీ పెద్ద టాస్క్..!!

ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ అయినప్పటికీ ఈటల రాజేందర్ బీజేపీలో రిలాక్స్ గా ఉండటం లేదు. బండిని మార్చితే పార్టీలోకి చేరికలు కొనసాగుతాయని ఈటల సూచన మేరకు బండిని అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది అగ్రనాయకత్వం. అయినా నేతలు బీజేపీని వీడితే ఈటలపై అగ్రనేతలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఆయన ఇప్పుడు పార్టీని వీడాలని ఆలోచన చేస్తోన్న నేతల లిస్టును రాసుకొని ఒక్కొక్కరిని బుజ్జగించే బాధ్యతను తీసుకున్నారు ఈటల.

పార్టీలో చేరుతారని నమ్మకం పెట్టుకున్న నేతలు బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని కమలం గూటికి చేరడం లేదు. కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. వారిని బీజేపీలోనే ఉంచడం ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గానున్న ఈటలకు ఇప్పుడు టాస్క్. చేరికల కమిటీ చైర్మన్ గా ఒక్క నేతను పార్టీలోకి తీసుకురాలేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గా నియామకం అయ్యాక ఇప్పుడు వలస నేతలను కాపాడుకునే ప్రయత్నంలో బిజీ అయిపోతున్నారు.

మాజీమంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని తెలియగానే ఆయన ఇంటికి వెళ్ళారు ఈటల. ఆయన్ను బీజేపీలోనే కొనసాగాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కొంతకాలం ఆగాలని చంద్రశేఖర్ కు ఈటల సూచించినప్పటికీ ఆయన పెద్దగా మనస్సు మార్చుకోలేదని..కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం ఇప్పించి ఆయన్ను శాంతపరిచారు. అయితే.. చాలామంది నేతలు అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారు. వారిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

Also Read : సీతక్కనే సీఎం – రేవంత్ సంచలన ప్రకటన