Viral Video : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల యాక్సిడెంట్ వీడియోస్ చూస్తూ ఉంటాం మనం. ఈ యాక్సిడెంట్ లో చాలా వరకు భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయినప్పటికీ అదృష్టవశాత్తు చిన్న గాయాలు కూడా కాకుండా బయటపడిన సంఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ యాక్సిడెంట్ ను రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైలు కింద పడినప్పటికీ క్షేమంగా ఆయన బయట పడిన ఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral Video : రైలు కింద పడిన అదృష్టవశాత్తు బయటపడిన వ్యక్తి…
విషయంలోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లాలోని భర్తన రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రైలు పూర్తిగా అతనిపైనుండి పోతున్న టైం సమయంలో ప్లాట్ఫారంకు మరియు రైలు చక్రాల మధ్య ఉన్న ఖాళీలో అతను పడిపోవడం జరిగింది. ఆగ్రా నుంచి బయలుదేరిన సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు భర్తనా రైల్వే స్టేషన్ నుంచి వెళుతుండగా ఈ వ్యక్తి పట్టాలపై పడిపోయాడు. కాగా ఈ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించగా పట్టాలకు మరియు ప్లాట్ఫారం మధ్యలో పడిపోవడంతో అదృష్టవశాత్తు ట్రైన్ క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళింది.

పట్టాలకు మరియు ఫ్లాట్ సాంగ్ ఏమన్నా కాళీ వలన ఆయన ప్రాణాలతో బయటపడడం జరిగింది. రైలు వెళ్లిపోగానే అతను అందరికీ దండం పెడుతూ ర వస్తువులను తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేయబడింది. నిజంగా ఇతను ఎంత అదృష్టవంతుడు ఎవరు ఉండరంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ తెలియజేస్తున్నారు. కొంతమంది నిజంగా అతను లేచిన టైం బాగుంది అంటూ తమ కామెంట్ల ద్వారా తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి.
भरथना रेलवे स्टेशन पर आज सुबह 9 बजे भूरा सिंह नाम के यात्री जल्दबाजी के चलते ट्रैक पर गिर गए। इंटरसिटी ट्रेन उनके ऊपर से गुजर गई। खुशकिस्मत रहे बाल बांका नहीं हुआ। लेकिन इन घटनाओं में सबक ये है कि जिंदगी आपकी है ट्रेन की नहीं… pic.twitter.com/x9tGRzPfTI
— Ravish Ranjan Shukla (@ravishranjanshu) September 6, 2022