Nayanatara : నయనతార తెలుగు తమిళ సినిమాలలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈ మధ్యనే విఘ్నేష్ శివన్ తో పెళ్లి చేసుకున్న నయనతార ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా మారి సోషల్ మీడియాలో కనిపించడం స్టార్ట్ చేశారు. నయనతార ఇప్పుడు విఘ్నేష్ శివతో హనీమూన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతకుముందు ఈ భామ రెండు సార్లు తన ప్రేమ విఫలమై చాలా బాధపడ్డా సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత విఘ్నేష్ శివన్ తో ప్రేమ చాలా రోజులు నడిచింది ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటలు కూడా దాటి ముందుకు వచ్చేసింది. నయనతార తెలుగులో చేసిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.
మొదట గజిని సినిమాలో సూర్య సరసన నటించిన ఈ భామ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తరువాత లక్ష్మి సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తాను తెలుగులో సూపర్ స్టార్ అని అటువంటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, అందరి సూపర్ స్టార్లతో వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలిగిపోయింది. అటు తమిళంలో ఇటు తెలుగులో తన చేసినా ప్రతి సినిమా హిట్ కావడంతో ఈమె సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది.
Nayanatara : నయన తార ను పెళ్లి అయిన తరవాత ఇలా చూసి ఉండరు.
తెలుగులో చిరంజీవి ప్రతిష్టాత్మకమైన చిత్రం అయినటువంటి సైరా లో ప్రధాన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే బయట తిరుగుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాను సరదాగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన అభిమానులను అలరించింది. మొదటిసారి పెళ్లయిన తర్వాత ట్రెండీ డ్రెస్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరించింది. కొద్ది కొద్దిగా తన అందాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తుంది అని నెటిజన్లు అంటున్నారు. నయన తార ను పెళ్లి అయిన తరవాత ఇలా ఇలా చూసి ఉండరు.