Viral Video : గజరాజు లేదా ఏనుగు.. భారీ ఆకారంలో ఉంటుంది. చివరకు అడవికే రాజులైన పులులు, సింహాలు కూడా ఏనుగును ఏం చేయలేవు. ఏనుగులు ఎంత సంతోషంగా ఉంటే అడవికి అంత మంచిది. ఏనుగులకు ఏమాత్రం కోపం వచ్చినా అవి అస్సలు ఊరుకోవు. రచ్చ రచ్చ చేస్తాయి. వాటికి ఏది కనిపిస్తే వాటిని నాశనం చేస్తాయి. అడవుల్లోనూ అవి సృష్టించే బీభత్సం మామూలుగా ఉండదు. అందుకే ఏనుగులకు అందరూ దూరంగా ఉంటారు. ఒక్కోసారి అవి గ్రామాల్లోకి దూరి ఊళ్లను నాశనం చేస్తుంటాయి. ఏది ఏమైనా ఏనుగును చూస్తేనే చాలామంది భయపడిపోతుంటారు. రోడ్డు మీద వాహనాలు కనిపించినా చాలు.. వాటిని ఒక్క ఉదుటున అక్కడ పడేస్తాయి. కార్లు కూడా వాటి ముందు దిగదుడుపే. బస్సులు, లారీలను కూడా అవి అవలీలగా నెట్టేయగలవు. అంతటి శక్తి ఉంటుంది వాటికి.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది ఏనుగుకు సంబంధించిన వీడియోనే. ఏనుగులకు కోపం వస్తే ఏం జరుగుతుందో… ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అడవుల వెంట దారి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఎప్పుడు ఎక్కడి నుంచి అడవిలోని జంతువులు రోడ్డు మీదికి వచ్చి రచ్చ చేస్తాయో అని వాహనదారులు టెన్షన్ పడుతుంటారు.
Viral Video : కారుపై ఏనుగు అటాక్
తాజాగా ఆ వీడియో ప్రకారం.. ఓ కారుపై ఏనుగు అటాక్ చేసింది. అసలు.. దానికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ.. కారును మాత్రం తుక్కు తుక్కు చేసింది గజరాజు. కారు డ్రైవర్.. ఏనుగు ధాటి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చివరకు కారు ముందు భాగాన్ని కాలితో తొక్కడం, తన నడుముతో కారును ఢీకొట్టడం, ఇలా కారుపై తన ప్రతాపాన్ని మొత్తం చూపించింది ఏనుగు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. ఏనుగుకు కోపం వస్తే ఇంత రచ్చ చేస్తుందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
What do you do when you’re itchy and you’re an elephant? ???? pic.twitter.com/fYUMYdlO5z
— Buitengebieden (@buitengebieden) September 6, 2022