Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లోని టాప్ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ మొదట్లో నయనతార చేసిన తప్పులు ఎలా ఉన్నా వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక మెట్టు ఎక్కుతూ సౌత్ ఇండస్ట్రీలోని ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ హీరోయిన్స్ కన్నా నయనతార రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంటుంది అంటే నయన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇటీవల నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట సెకండ్ హనీమూన్ లో బిజీగా ఉన్నారు.
దానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ కుర్రాలను వేడెక్కిస్తుంటుంది నయనతార. అయితే రీసెంట్ గా నయనతారకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార పిల్లలను కనదలుచుకోవడం లేదట. నయనతార పిల్లల్ని కనే ప్రసక్తే లేదట. దానికి కారణం ఆమె ఆరోగ్య పరిస్థితి. నయనతారకు మొదటి నుంచి గర్భసంచి వీక్ గా ఉందంట. దీంతో ఆమెకు గర్భం దాల్చడానికి చాలా కష్టం అంటున్నారట డాక్టర్స్. ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nayanthara : ఈ విషయంలో నయనతార దురదృష్టవంతురాలు…
అయితే ఈ విషయం విగ్నేష్ శివన్ కి కూడా తెలుసు. అన్నీ తెలిసి పెళ్లికి ఒప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఓ బిడ్డను దత్తత తీసుకోవడానికి రెడీ అయి పెళ్లి చేసుకున్నారట. అయితే నయనతారకు ఆప్షన్ ఉంది. సరోగసి ద్వారా పిల్లల్ని కనవచ్చు. కాని దానికి విగ్నేష్ ఒప్పుకోలేదట. కచ్చితంగా దత్తతగా తీసుకొని తల్లిదండ్రులుగా మారాలి అని చెప్పి పెళ్లికి ముందే ఓ నిర్ణయానికి వచ్చారట. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ గా మారింది. అన్నీ ఉన్నాయి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అమ్మ అనే పిలుపు దగ్గర అవుతుంది. కానీ ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయలేదు. ఆ విషయంలో నయనతార దురదృష్టవంతురాలు అంటున్నారు నెటిజన్స్.