Appetite increase : బాగా ఆకలి అవ్వాలంటే….. ఈ చిట్కాలను పాటిస్తే చాలు.

Appetite increase : పిల్లలు ఆకలి సరిగా లేదు అంటూ అన్నం వద్దు అంటూ మారం చేస్తారు. స్కూల్ కి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లి మరలా దాన్ని అలాగే తీసుకొని వస్తారు. ఎందుకు భోజనం తినలేదు అని అడిగితే ఆకలి లేదు అంటూ సమాధానం ఇస్తారు. కొందరు అన్నం తినకుండా చిరుతిండ్లు పై ఆసక్తి చూపుతున్నారు.ఆకలి బాగా అయితేనే మనం భోజనం చేస్తాం. ఇలా తిన్నప్పుడు అది జీర్ణం అవుతుంది. దీంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే కడుపులో ఆకలిగా లేకపోతే ఆహారం తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఇటువంటి సమయంలో ఆహారాన్ని చూస్తేనే చిరాకుగా అనిపిస్తుంది. ఆహారం తినకపోతే అలసట నీరసం వస్తుంటాయి.

Advertisement

Appetite increase : బాగా ఆకలి అవ్వాలంటే…..

ప్రస్తుతం చాలామంది ఆకలి లేని సమస్యతో బాధపడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ఆకలి కాకుండా ఉండటానికి ప్రధమ కారణాలవుతున్నాయి. చిన్నచిన్న నొప్పులైన… లేదా క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలైనా ఆకలిని కోల్పోయేలా చేస్తుంటాయి. ఆకలి పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టీ స్పూన్ బెల్లం పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి తో కలిపి రోజు ఒక పూట తీసుకోవడం వల్ల ఆకలి బాగా అవుతుంది. ఒక టీ స్పూన్ అల్లం రసంలో కొంచెం రాక్ సాల్ట్ ను కలిపి ఇలా వారం రోజులపాటు ఈ మిశ్రమాన్ని భోజనం అయిన తర్వాత తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. నిమ్మరసం ఉసిరి రసం తేనె ఈ మూడింటిని సమానంగా కలిపి ఈ మిశ్రమాన్ని పరిగడుపున తీసుకుంటే మలబద్ధక సమస్యలు దూరమై జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

Advertisement
Just follow these tips to improve your appetite
Just follow these tips to improve your appetite

ప్రతిరోజు భోజనం చేసే ముందు రెండు వేలుకులను నోట్లో వేసుకొని నెమలి మింగాలి. ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై ఆకలి బాగా పెరుగుతుంది. రెండు టీస్పూన్ల వాములో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఎండలో ఆరనివ్వాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది. ద్రాక్షాలు చాలా తక్కువగా యాసిడ్స్ ఉండి ఇది జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. దీంతో ఆకలి బాగా పెరిగి జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. దాల్చిన చెక్క పొడి తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఆకలి అమాంతంగా పెరగడమే కాకుండా మలబద్ధక సమస్యలు కూడా దూరమవుతాయి.

Advertisement