NTR 30 : కొరటాల తో ఎన్ టి ఆర్ 30 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే!

NTR 30 : జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా, ఎప్పుడు సినిమా ధియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలంటే అభిమానులకు అంత ఇష్టం. ఎన్టీఆర్ నటన, డాన్స్ అందరికీ ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఘన విజయం సాధించింది. ఆర్ ఆర్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు నటించే సినిమా ఎన్టీఆర్ కు 30వ చిత్రం కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడని మనందరికీ తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్లో అంతకుముందే జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఇది బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రెండో సినిమా రాబోతుంది. ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ 30 గా రూపొందే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన ఇది వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ను కొరటాల శివ ఇవ్వడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

NTR 30 : కొరటాల తో ఎన్ టి ఆర్ 30 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే!

NTR 30 went on the sets of the project with Koratala
NTR 30 went on the sets of the project with Koratala

అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యనే స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేసే పనిలో ఉన్న కొరటాల శివ ఇప్పుడు దానిని పూర్తి చేశారట. అంతేకాకుండా త్వరలోనే ఫ్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టి సినిమాలు సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు హీరోయిన్ కు సంబంధించిన వివరాలు కూడా ప్రకటించేందుకు చిత్ర వర్గం ప్లాన్ చేస్తూ ఉందంట. అయితే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ లు కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు.