Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఆయనకు తెలుగు పరిశ్రమలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు ప్రాణం ఇచ్చెంత పిచ్చి అభిమానుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ కు తెలుగు పరిశ్రమలో తొలి సినిమా నుంచి ఇప్పటి సినిమాల వరకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న పెద్ద హిరోలలో ఒకరు పవన్ కళ్యాణ్. అలాగే రాజకీయాల్లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్.
ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిన, దేని గురించి అయిన మాట్లాడిన నిమిషాల్లోనే ట్రెండింగ్ అవుతుంది. హీరోగా ఒక ఫోజ్ ఇచ్చిన, జనసేనా అధ్యక్షుడిగా ఒక మాట మాట్లాడిన అభిమానులు పిచ్చెక్కిపోతారు. లైకులు, కామెంట్లు, షేర్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. అయితే ఈమధ్య పవన్ కళ్యాణ్ పేరు ట్విట్టర్ బాగా ట్రెండ్ అవుతుంది.
Pawan Kalyan : మరోసారి ట్విట్టర్ లో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్…ఎందుకంటే…?

అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఏమి మాట్లాడలేదు, ఫోటోలు కూడా ఏమి షేర్ చేయలేదు. జస్ట్ తన ట్విట్టర్ ఫ్రోఫైల్ పిక్ ను మార్చేసారు అంతే. అంతకుముందు ట్విట్టర్ డిపిగా కళ్యాణ్ గుబురు గడ్డంతో ,బ్లూ కలర్ షర్ట్ తో ఉన్న ఫోటోను పెట్టారు. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి కొత్త ఫోటోను అప్ లోడ్ చేసారు. ఈ లేటెస్ట్ పిక్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ ఫోటోలో వెనుక జనసేన పార్టీ ఉండగా, పవన్ సిరియస్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్ నెట్టింట్లో ట్రెండింగ్ గా నిలిచింది.