Rashmikia Mandana : తెలుగులో `ఛలో ` సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది రష్మిక మందన్న. ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన “గీతగోవిందం” సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఈ భామకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరి లేరు నీకెవ్వరు లో జోడి కట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక కేరీర్ ను వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సినిమాలో ఛాన్ప్ కొట్టేసింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రతో కుర్రాళ్ల మనసులను దోచుకుంది.ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో అమాంతం పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, కన్నడ సినిమాలతో పాటు తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. ఈ మధ్య తమిళంలో కార్తీ నటించిన “సుల్తాన్” సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ వైపు ఆసక్తి చూపుతుంది. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడుకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
Rashmikia Mandana : ఈ సారి జాక్ పాట్ కొట్టిసిందిగా..

ఇప్పుడు బాలీవుడ్ లో సిదార్థ మల్హోత్ర తో “మిష్టర్ మజ్ను” సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా పాకిస్థాన్ నేపథ్యంలో సాగనున్నదని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న “గుడ్ బై” సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వీటితో పాటు మరో పెద్ద ఆఫర్ ను అందుకుందంట ఈ బ్యూటీ. శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో హీరో టైగర్ ష్రఫ్ నటించబోతున్న సినిమాలో రష్మిక మందన్న ను తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.