pavan Kalyan: అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఇష్టం గా పిలిచే పేరు పవర్ స్టార్. అభిమానులు తన కోసం ఏమైనా చేస్తారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించబోయే చిత్రం గురించి కొన్ని చర్చలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చిత్రాలు పైన ఎన్నో పుకార్లతో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు ఎప్పటి వరకు ఏమి అయిందో అర్థం కావట్లేదు. ఈ సినిమా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మామూలుగా ఈ సినిమా ఆపి నట్లు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా భవదీయుడు భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ సినిమా మీద కొన్ని చర్చలు నడుస్తున్నాయి. అలాగే సురేందర్ రెడ్డితో జరగాల్సిన మూవీ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ముందు మాట ఇచ్చిన సినిమాలు. వీటిని వదిలేసి ఇంకొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. తమిళంలో చేసే సినిమా వినోదియ సిత్తా సముద్ర ఖని డైరెక్షన్లో చేస్తున్నట్లుగా కొన్ని రోజులు బట్టి టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిధర్మతేజ్ ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. ఈ సినిమా అసలు ఎప్పుడో రావాలని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. దీని ప్రకారంగా చూస్తే అభిమానులు నెగిటివ్ టాక్ చూసి సినిమా ఆగిపోయినట్లు గా టాక్స్ వినిపిస్తున్నాయి.
Pavan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టు పూజ ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది ?

కానీ ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని వినోదియ సిత్త మూవీ తప్పక జరుగుతుంది అంటున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖనినే అయినా, పవన్ మిత్రుడైన త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని. ఈ చిత్రం ఎవరికి తెలియకుండా జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ న్యూస్ గత మూడు ఈ వార్త రోజులుగా మీడియాలో హల్ చల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కోసం పూజలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నట్లు అయితే సమాచారం గట్టిగా వినిపిస్తుంది. ఈసారి ఎన్నికలు కోసం దృష్టి సరించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని సోషల్ నెటిజన్లు అంటున్నారు.