Pawan Kalyan : పీఎస్ పీకే.. లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు. అదో ట్రెండ్. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉండరు. భక్తులు ఉంటారు. ఆయన పేరు చెబితేనే ఒళ్లంతా పులకరించిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా విడుదలైతే చాలు.. ఇక ఆయన అభిమానులకు ఆ రోజు పండుగ రోజే. అది పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్. ఆయన రాజకీయాల్లో ఉన్నా.. ఇంకెక్కడ ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం పవర్ స్టారే. ఆయనకు సాటీ లేరు ఇంకెవరూ.. రారు కూడా.

అయితే.. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా నటీనటులు పలు యాడ్స్ లో నటించే విషయం అందరికీ తెలుసు కదా. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా కొందరు హీరోలను బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమించుకుంటాయి. కోట్లకు కోట్ల డబ్బులను ఇస్తాయి. కొందరు హీరోలు పలు యాడ్స్ కూడా చేసి చేతి నిండా సంపాదిస్తారు. అలా ఎక్కువగా యాడ్స్ లో నటించే హీరోల్లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. చాలా హీరోలు ఇప్పుడు యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు.
Pawan Kalyan : ఆ ఒక్క యాడ్ తోనే ఆపేసిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?
అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయడు. ఏ యాడ్ లోనూ నటించడు. కానీ.. 20 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్ నటించిన ఓ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది పెప్సీకి సంబంధించిన యాడ్. కొన్ని రోజుల పాటు పెప్సీ యాడ్ ను ప్రమోట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయలేదు. తాను తాగని పానీయాన్ని ఎందుకు ప్రమోట్ చేయాలి. జనాలను తాగమని ఎందుకు చెప్పాలి అని అనుకొని అప్పటి నుంచి ఏ యాడ్ కూడా చేయకండా ఉండిపోయాడు పవన్ కళ్యాణ్. అందుకే అదే ఆయన మొదటి యాడ్, చివరి యాడ్ అయిపోయింది. అయితే.. 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ నటించిన ఆ పెప్సీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో 20 క్రితం పవన్ ఎలా ఉన్నారో.. చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.