Health tips :రోజు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చా..

Health tips : దానిమ్మ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎర్రగా ఉండే ఈ పండు గింజలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు అత్యంత శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. స్వయంగా మనం తయారు చేసుకున్న దానిమ్మ జ్యూస్ తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. వివిధ రకాల మార్కెట్లలో దొరికే జ్యూస్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానిమ్మ జ్యూస్ ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.

Advertisement

ఈ సమస్య గతం కంటే ఇప్పుడు చాలా అధికంగా ఉంది. మన గుండె ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో దానిమ్మరసం కీలకపాత్ర వహిస్తుందిని వైద్య నిపుణులు చెబుతున్నారు. టానిన్లు, ఆంథోసైనిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. వీటిని శక్తివంతమైన ఆంటీ.. అధెరోజె నిక్ ఏజెంట్గా పని చేస్తాయి. వివిధ రకాల ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి.

Advertisement

Health tips :రోజు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చా..

pomegranate juice prevent heart disease
pomegranate juice prevent heart disease

ఈ రసంలో గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే రెండు రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దానిమ్మ రసం లోనే పాలీ ఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తాయి. ఎర్రటి వర్ణంతో కలిగిన ఈ జ్యూస్ చాలా అందంగా ఉండి ఇతర పండ్ల రసాల కంటే ఎక్కువ ఆక్సిడెంట్లును కలిగి ఉంటుంది. ఒక కప్పు దానిమ్మ పండు లో 120 కేలరీలు, 32 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఫైబర్ 6 గ్రాములు ఉంటాయి. ఈ పండులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె కు లభిస్తాయి.

దానిమ్మ నుండి ఎక్కువ పోషకాలు పొందాలంటే తాజాగా తయారు చేసిన దానిమ్మ రసాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.ఈ రసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచ రాదు. దీని నుండి ఎక్కువ పోషకాలు పొందడానికి వెంటనే పిండిన దానిమ్మ జ్యూస్ త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ మరియు నారింజ రసం తో దానిమ్మ రసాన్ని కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ మరియు రక్త పోటు మందులను తీసుకునేవారు, ఆహారంతో పాటు దానిమ్మ రసాన్ని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Advertisement