Viral Video : వామ్మో బామ్మ.. నువ్వు మనిషివి కాదు.. నీకు ఇంత ధైర్యం ఎక్కడిది.. నెటిజన్లు షాక్.. వైరల్ వీడియో

Viral Video : ఏ పని చేయాలన్నా కాస్తో కూస్తో ధైర్యం కావాలి.. సాహసం కావాలి. అదే లేకపోతే ఏం చేయలేం. జీవితం నిస్సత్తువగా ఉంటే ఏదైనా సాహసం చేయాలనిపిస్తుంది. కొందరు సాహసాలు చేస్తూ జీవితాలను ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు సాహసాలను చూస్తూ తమ వల్ల ఏం కాదని సర్దుకుపోతుంటారు. కానీ.. ఈ బామ్మ మాత్రం ఆ టైప్ కాదు. సాహసాలు చేసే టైప్. వందేళ్లు దగ్గర పడ్డా ఏమాత్రం భయపడకుండా తను చేసిన సాహసం చూసి అక్కడి వాళ్లే కాదు నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు.

Advertisement
old woman jumps in to ganga river video viral
old woman jumps in to ganga river video viral

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ బామ్మ వీడియో అది. అందులో ఏం వింత ఉంది అంటారా? అది బామ్మ సాహసానికి సంబంధించిన వీడియో. హర్కీ పైడి అనే వంతన పై నుంచి ఆ బామ్మ గంగా నదిలోకి దూకుతుంది. ఓవైపు వేగంగా ప్రవహిస్తున్న నది.. మరోవైపు చుట్టూ భక్తుల స్నానాలు.. సడెన్ గా వంతెన పైనుంచి బామ్మ దూకడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

Advertisement

Viral Video : బామ్మను చూసి నెటిజన్లు ఫిదా

సోషల్ మీడియాలో ఈ వీడియో దూసుకుపోతోంది. వంతెన మీద బామ్మ నిలబడగా.. దూకాలంటూ పక్కనే ఉన్నవాళ్లు తనను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా బామ్మ పై నుంచి ఒక్కసారిగా నీళ్లలోకి దూకేసింది. బామ్మ నదిలోకి దూకడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పై నుంచి దూకి.. ఏమీ తెలియనట్టు ఒడ్డుకు ఈదుకుంటూ బామ్మ వెళ్లిపోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ బామ్మకు ఇంత ధైర్యం ఎక్కడిదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్లు అయితే.. బామ్మ ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాదు.. సోమరిపోతులు ఈ బామ్మ వీడియో చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ హితువు పలుకుతున్నారు.

Advertisement