Pooja Hegde : ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం కొందరి జాతకాలు మారుతూ ఉంటాయి. అదృష్టం ఎవరి తలుపులు తడుతుందో.. నైట్ కి నైటే పెద్ద స్టార్ గా మారుతారో మనకి తెలియడం చాలా కష్టం. ఛాన్స్ల కోసం సంవత్సరాలు తరబడి తిరిగిన వాళ్లకి రానటువంటి వాళ్లకి ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకోవచ్చు.. స్టార్ గా ఎదిగిన వాళ్ళు ఫెయిల్యూర్ను అందుకుంటూ లైమ్ లైట్ నుండి కనపడకుండా పోతున్నారు. అయితే ఇటువంటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే అన్నిటికీ రెడీగా ఉండాలి అంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే.. దువ్వాడ జగన్నాథం మూవీతో ఎంతో ఫేమస్ అయిన హీరోయిన్ల వరసలో చేరిన పూజ ఏగ్దే.. ఆ తదుపరి టాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్ హీరో మూవీ అంటే హీరోయిన్ పూజా హెగ్డే దాన్లో ఉండాల్సిందే.. అంతగా ఫేమస్ అయింది.
బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ చరణ్, మహేష్ ,వరుణ్ తేజ్, అఖిల్, ఎన్టీఆర్ ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరోగా వీళ్ళకి ఆప్షన్ పూజ హెగ్డే నే . కావడంతో ఆ అమ్మడు శరవేగంతో దూసుకెళ్లింది. దక్షిణాదిలో స్టార్ కథానాయకగా ఎంతో ఫేమస్ ని అందుకున్న పూజ హెగ్డే తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన “బీస్ట్” సినిమాకి అత్యంత భారీ స్థాయిలో రేమ్యుర్నేషన్ అందుకుని ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది గా నిలబడింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభాస్ తో కలిసి చేసిన “రాదేశాం రామ్” చరణ్ తో చేసిన ఆచార్య మూవీలు ఫ్లాప్ అవడంతో ఈ బుట్ట బొమ్మ జోరు కాస్త తగ్గిపోయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమాలో చేస్తోంది. అలాగే బాలీవుడ్లో 2 భారీ ప్రాజెక్టులను సైన్ చేసింది. ఇక ఇది పక్కన పెడితే..
Pooja Hegde : స్నేహితుల నుంచి ఆరోజు ఫోన్లు రావట…
విజయాలు.. అపజయాలు పై పూజా హెగ్డే మాట్లాడిన విధానం.. ఇప్పుడు అందర్నీ అలరిస్తోంది. నా అదృష్టం కొద్ది మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను.. ఇక్కడ నా ప్రతిభతో నిలబడినాను. సక్సెస్ ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. సక్సెస్ అనుకున్న మూవీ బాక్సాఫీస్ వద్ద నీరసపడిపోవచ్చు. ఎటువంటి బజ్ లేని మూవీ బ్లాక్ బాస్టర్ అవచ్చు.. కావున ఇక్కడ దేనికైనా రెడీగా ఉండాలి. మూవీ సక్సెస్ అయితేనే అభిమానులు మన గురించి మాట్లాడుకుంటారు.. లేకపోతే పక్కన పెడతారు.. ఆరోజు కనీసం ఫ్రెండ్స్ నుండి కూడా ఫోన్లు కూడా రావు..
ఇండస్ట్రీ సంగతి ఇంతే.. సక్సెస్ పడితే ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఇక అందరికీ ఇదే విధంగా జరుగుతుంది. ఈ విషయంలో నేనేమి స్పెషల్ కాదు.. ఈ పరిశ్రమలో సక్సెస్ కి విలువనిస్తారు.. ఆ వాస్తవం నాకు తొందరగానే అర్థమైంది. దానికి నా మూవీ విడుదల అంటే కాస్త టెన్షన్ పడుతూ ఉంటాను. అయితే ఆరోజు నా ఫోన్ రింగ్ అయింది అంటే అదృష్టం బాగున్నట్లే.. లేకపోతే ఇక ఆ పరిస్థితిని మీకు తెలియజేయడం చాలా కష్టం అని తన బావన ను తెలిపింది ఈ అమ్మడు..