Shakini Dakini Review : శాకిని డాకిని మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Shakini Dakini Review : సినిమా పేరు : శాకిని డాకిని

Advertisement

నటీనటులు : రెజీనా కసాండ్రా, నివేద థామస్, సుధాకర్ రెడ్డి, రఘుబాబు, పృథ్వీ తదితరులు

Advertisement

దర్శకత్వం : సుధీర్ వర్మ

ప్రొడ్యూసర్స్ : దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి

సినిమాటోగ్రఫీ : రిచార్డ్ ప్రసాద్

సంగీతం : మిక్కీ జే మేయర్

విడుదల తేదీ : 16 సెప్టెంబర్ 2022

తెలుగులో హీరో ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా తక్కువ. హీరోయిన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. అందులో ఒకటి అరుంధతి. అటువంటి సినిమా మళ్లీ రాదు. అలా హీరోయిన్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తాజాగా మరోసారి హీరోయిన్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా శాకిని డాకిని. ఈ సినిమాలో రెజీనా, నివేద థామస్ నటించారు. ఈ సినిమా షూటింగ్ జరిగింది కూడా ఎవ్వరికీ తెలియదు కానీ.. సినిమాకు ప్రమోషన్స్ మాత్రం బాగానే చేశారు. ఇద్దరు హీరోయిన్ల మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

shakini dakini movie review and rating
shakini dakini movie review and rating

Shakini Dakini Review : కథ

ఈ సినిమాలో రెజీనా పేరు దామిని. నివేద థామస్ పేరు షాలిని. ఇద్దరూ పోలీస్ ట్రెయినింగ్ తీసుకుంటూ ఉంటారు. అకాడమీలో జాయిన్ అవుతారు. ఇద్దరూ ట్రైనింగ్ అకాడమీలో ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ ఉండేవారు. కానీ ఒకరోజు రాత్రి ఒక అమ్మాయిని వేరే వాళ్లు కిడ్నాప్ చేయడం చూస్తారు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినా కూడా వాళ్లు బిజీగా ఉండటం వల్ల కిడ్నాప్ గురించి పెద్దగా పట్టించుకోరు. దీంతో అన్ అఫిషియల్ గా దామిని, షాలిని ఇద్దరూ ఆ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తారు. అప్పుడే వాళ్లకు అది కేవలం ఒక కిడ్నాప్ మాత్రమే కాదని.. దాని వెనుక పెద్ద క్రైమ్ జరుగుతోందని తెలుసుకుంటారు. ఆ క్రైమ్ ను ఇద్దరూ బయటికి తీస్తారా? ఆ క్రైమ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు.. అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఆ ఇద్దరి నటన గురించే. రెజీనా, నివేద ఇద్దరూ తమ నటనతో ఇరగదీశారు. నువ్వా నేనా అన్న రేంజ్ లో ఇద్దరూ బాగా నటించారు. వాళ్ల ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు.. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు ఇద్దరూ పోటీ పట్టారు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లంతా తమ పాత్రల మేరకు నటించారు. నిజానికి ఈ సినిమా ఓ కొరియన్ సినిమాకు రీమేక్. కానీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా కథను రాసుకున్నారు. సినిమా కథలో బలం ఉండటం.. తమ పాత్రలకు న్యాయం చేయడంలో ఇద్దరు హీరోయిన్లు సఫలం కావడంతో సినిమా ప్రేక్షకుల అంచనాను అందుకుంది. కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం సినిమాలో లాజిక్స్ మిస్ అయ్యాయి. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఏం లేదు.

ప్లస్ పాయింట్స్

హీరోయిన్స్

కామెడీ

డైలాగ్స్

కథ

మైనస్ పాయింట్స్

సంగీతం

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

స్క్రీన్ ప్లే

సెకండ్ హాఫ్

యువతరం రేటింగ్ : 2.25/5

Advertisement