Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ ప్రాజెక్ట్ కె ‘ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం అంటే 2024 అక్టోబర్ 24 న లేదా 2025 జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ అశ్విని దత్ తెలిపారు. 2024 జనవరి కల్లా షూటింగ్ పూర్తి అవుతుందని ఆ తర్వాత ఎనిమిది నెలల లోపు గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ‘ ప్రాజెక్టు కే ‘ సినిమా అవుట్ పుట్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు అని స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ తెలిపారు.

చైనా, అమెరికా వంటి ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ ‘ ప్రాజెక్టు కె ‘ సినిమా అవెంజర్స్ తరహా సినిమా అని అన్నారు. అలాగే అమితాబచ్చన్ గతంలో ఎన్నడూ లేని పాత్రల్లో నటించబోతున్నారు. వీటన్నింటికి మించి ప్రభాస్ అద్భుతంగా నటించారంటు ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్రశంసలు కురిపించారు. అశ్వినీదత్ ప్రకటనతో ఒక్కసారిగా ప్రాజెక్టు కె మూవీ ట్విట్టర్లో ట్రేడింగ్ లో వచ్చింది. డార్లింగ్ ఫాన్స్ ఎగ్జాయిట్ అవుతూ రిలీజ్ డేట్ ను షేర్ చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొంటున్నాయి.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…

Prabhas project k movie update
Prabhas project k movie update

పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను అందుకునేందుకు రెబల్ స్టార్ భారీగానే కష్టపడిన ‘ సాహో ‘,రాధేశ్యామ్’ సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచి తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే ప్రభాస్ ఎలాగైనా అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చేందుకు భారీ ప్రాజెక్టులతో రెడీ అవుతున్నాడు. ‘ ఆది పురుష్ ‘ ‘ సలార్ ‘ సినిమాలతో వచ్చే ఏడాది సందడి చేయనుండగా ఆ తరువాత ‘ ప్రాజెక్టు కే ‘మూవీ ఆడియన్స్ ముందుకు రానున్నారు.ఇదే కాకుండా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మన డార్లింగ్. ప్రాజెక్ట్ కే దాదాపు 500 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.