Health Benefits: ప్రస్తుత కాలంలో పెద్దవారు మోకాళ్ల నొప్పులు సమస్యతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి .మన శరీరంలో క్యాల్షియం, విటమిన్ డి సరైన మోతాదులో ఉందో లేదో తెలుసుకోవడం. సరైన పద్ధతిలో నడవడం, కూర్చోవడం వంటివి సవరించుకోవడం,పెయిన్ కిల్లర్లు టాబ్లెట్స్ ఎక్కువగా వాడడం, అధిక బరువు తగ్గించడంలో శ్రద్ధ వహించకపోవడం, ఆహార పదార్థాల నియమాలను సరిగా పాటించకపోవడం వంటివి మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలు అవుతాయి.
జీవితంలో ఇటువంటి నొప్పులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలకు కనీసం 450 మిల్లీగ్రాముల కాలుష్యం ఉండాలి. క్యాల్షియం బాడీకి పట్టాలంటే డి విటమిన్ కావాలి. కాబట్టి కాల్షియం లోపం వల్లనే మోకాళ్ల నొప్పులు వస్తాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. అందుకని నువ్వులుబెల్లం ఉండలు, ఆకుకూరలు తోటకూర, బచ్చలి కూర ,మెంతికూర ,మునగాకు లాంటివి తీసుకుంటే శరీరానికి కావాల్సిన క్యాల్షియం అధికంగా లభిస్తుంది.
Health Benefits : ఇవి తినండి.. జీవితంలో మోకాలు నొప్పుల సమస్యలు దరిచేరవు.

ఉదయం ఉదయం 6 7 గంటల సమయంలో ఎండలో నిల్చడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. శరీరానికి డి విటమిన్ ఎంతో అవసరం. డి విటమిన్ లేని వాళ్ళు డి విటమిన్ టాబ్లెట్స్ వాడడం మంచిది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చేయకూడదు, వంగి బరువులు పట్టడం, మెట్లు ఎక్కడం, కాళ్లు మడిచి ఆసనాలు వేయడం, వంటివి చేయకూడదు. నొప్పులు ఎక్కువ గా ఉన్నవారు ఫ్యాడ్స్ పెట్టుకోవాలి. రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు గుంతలు ,రాళ్లు వంటివి చూసుకొని నడవాలి.
పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడడం వల్ల నొప్పి నుండి ఉపశమనం ఉంటుంది కానీ పూర్తి సమస్య మాత్రం తగ్గదు. వచ్చిన జబ్బు తగ్గడానికి పెయిన్ కిల్లర్ కి అసలు సంబంధం లేదు. నొప్పి మాత్రం మీకు తెలియకుండా చేస్తుంది. పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ వంటివి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ టాబ్లెట్స్ ని ఎప్పుడో ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాలి.