Health Tips : కాలేయాన్ని ఆల్కహాల్  కాకుండా మనం తినే ఆహార పదార్థాలు కూడా దెబ్బతీస్తాయా?

Health Tips : మన శరీరంలో అన్ని అవయవాలతో పాటు కాలేయం కూడా చాలా ముఖ్యమైనది. తప్పనిసరిగా దీని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కాలేయం ఆల్కహాల్ తాగడం వల్ల కాకుండా మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల ద్వారా దెబ్బతింటుంది. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం శరీరంలో ఉన్న మలినాలను ,వ్యర్ధాలను బయటకు పంపడంలో కీలక పాత్ర వహిస్తుంది. కాలేయం మన శరీర భాగాలలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది రోజు 500 కంటే ఎక్కువ పనులను నిర్వహిస్తుంది. మనం తిన్న భోజనం అరగటానికి అవసరమయ్యే పిత్తా రసాన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే రక్తంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది.

ఇది మన శరీరంలో జీవక్రియ పాత్రను వహిస్తుంది. మానవ శరీరంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు కాలెయాని దెబ్బ తీస్తాయి. అవి ఏంటో చూద్దాం. చక్కెర వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వీటితోపాటు కాలేయం ఒకటి. శుభ్రం చేసిన చక్కెర ను ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఎ మన శరీరానికి ఎంతో అవసరం అంతేకాకుండా విటమిన్ ఏ కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.విటమిన్ ఏ మన శరీరంలో ఎక్కువైతే కాలేయ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు వెల్లడించారు. పండ్లు, కూరగాయల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది.

Health Tips : కాలేయాన్ని ఆల్కహాల్  కాకుండా మనం తినే ఆహార పదార్థాలు కూడా దెబ్బతీస్తాయా?

health tips for healthy liver
health tips for healthy liver

తెల్లగా ఉండే పిండి ఎక్కువ శుద్ధి చేయబడి ఉంటుంది. ఇలా శుద్ధి చేయబడిన పిండిలో ఫైబర్ ,విటమిన్ ,ఖనిజాలు ,వంటి పోషకాలు అధికంగా తగ్గిపోతాయి. ఇలాంటి పదార్థాలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి అనేక వ్యాధులకు గురిఅవుతాము. బిస్కెట్లు ,బ్రెడ్ వంటివి వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది పెయిన్ కిల్లర్, ట్యా బ్లెట్స్ ను బాడీ నొప్పులకు ,తలనొప్పికి ఎక్కువగా తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కావు. ఇవి కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని వైద్య నిపుణుల సహాయంతో తీసుకోవాలి.