Prabhas Marriage : పెళ్లిపై క్లారిటీ ఇవ్వనున్న ప్రభాస్ తల్లి…ప్రభాస్ బర్త్డే సందర్భంగా గుడ్ న్యూస్..

Prabhas Marriage : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని రెబల్ స్టార్ గా ఎదిగాడు.ఆ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ స్టార్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా ప్రభాస్ గా మారిపోయాడు. అయితే త్వరలోనే ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈనెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు.

Advertisement

Is Prabhas Getting Married? - Telugu Rajyam

Advertisement

ఇక ఈ సందర్భంగా ప్రభాస్ తల్లి ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పెద్దమ్మ ఇటీవల ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించగా ఇప్పుడు ప్రభాస్ తల్లి గుడ్ న్యూస్ చెప్తుంది అనడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.మరి ముఖ్యంగా ప్రభాస్ అనుష్కలకు పెళ్లి జరిగితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వీరిద్దరికీ పెళ్లి కావాలని గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ అనుష్క కలిసి మిర్చి , బిల్లా ,బాహుబలి వంటి సినిమాల్లో నటించడంతో వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుందంటూ అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వీరిపై కొన్ని రూమర్స్ కుడా మొదలయ్యాయి.ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు కూడా ప్రచారం జరిగాయి. కానీ వీటిని ప్రభాస్ మరియు అనుష్క ఖండించిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య స్నేహం తప్ప మరి ఏమి లేదని అప్పట్లో వారు తెలియజేశారు. దీంతో ప్రభాస్ అనుష్క పెళ్లి జరగడం కష్టమేనని అభిమానులు కూడా తీర్మానించుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పుట్టినరోజు వస్తుండగా ఈ సందర్భంగా ప్రభాస్ తల్లి పెళ్లి గురించి అనౌన్స్ చేస్తానని చెప్పడం ప్రేక్షకులను ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసేలా చేస్తుంది. మరి ఇలా వస్తున్న వార్తల లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement