Priya Anand : ప్రియా ఆనంద్ ఈమె తొలిసారి తమిళ్ యాక్షన్ త్రిల్లర్ వామన్ చిత్రంలో తరకెక్కింది. తర్వాత ఈమె తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. లీడర్ అనే సినిమాతో మొదలైంది. ఈ అమ్మడు పలు భాషల చిత్రాలలో నటించింది. ప్రియా ఆనంద్ ఒకప్పుడు తెలుగు సినిమాలు వరుసగా నటించింది. ప్రియ ఆనంద్, రానా సరసన శేఖర్ కమ్మల, దర్శకత్వంలో చేసింది. ఈ సినిమాతో ఈ అమ్మడుకి పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత రామ్ పోతినేని తో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాలో ప్రియా చేసింది. ఈ సినిమాలో కూడా అనుకున్నంత అలరించలేకపోయింది.
ఎన్నో సినిమాలు చేసిన ఈ అమ్మడు పెద్దగా క్రేజ్ పెంచుకోలేకపోయింది. ఈ బామ తెలుగు సినిమాలలో అవకాశాలు రాకపోయినా తమిళ్లో వరుస చిత్రాలతో, అలాగే వెబ్ సిరీస్లలో అందర్నీ ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా, ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తుంది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రియా ఆనంద్ ,స్వామి అంటే నాకు చాలా ఇష్టం ఆయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే అందరూ తనని ఇష్టపడుతూ ఉంటారు.
Priya Anand : నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలి అని ఉందంట అమ్మడుకు.

నేను కనుక పెళ్ళంటూ చేసుకుంటే నేను నిత్యానందనే చేసుకుంటా, అని చెప్పి అందరిని అవాక్ చేస్తుంది. నిత్యానంద కొన్ని వివాదాలతో ఇండియా నుండి వెళ్ళాడు, ఈక్వేర్ ప్రాంతంలో చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టి అందులోనే ఉంటున్నాడు. ఇటీవల లో స్వామి ఆరోగ్యం సరిగా లేదు అని వార్తలు వస్తున్నాయి ఈ నిత్యానంద ఓ హీరోయిన్ తో ఉన్న వీడియోలు బయటికి వచ్చి హల్చల్ చేస్తున్నట్టు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ అమ్మడు ప్రియా ఆనంద్ తనపై ప్రేమ వ్యవహారం మునిగినట్లు ఇంటర్వ్యూలో తెగ హల్చల్ చేస్తుంది. అలాగే ఈ అమ్మడు 10 సంవత్సరాల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది.