Viral Video : ఈ మధ్య సోషల్ మీడియాలో పెళ్లి వేడుకల్లో వేసే డ్యాన్సులు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు వేసే డ్యాన్స్ కన్నా.. పెళ్లికూతురు, పెళ్లికొడుకు వేసే డ్యాన్సులు మాత్రం అదిరిపోతున్నాయి. వాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య బుల్లెట్ బండి సాంగ్ కు పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ ఎలా వైరల్ అయిందో అందరికీ తెలుసు కదా. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కానీ.. ఈ సారి పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసింది బుల్లెట్ బండి పాటకు కాదు.. అప్పట్లో బాలీవుడ్ లో ఫేమస్ అయిన జంట గోవిందా, కరిష్మా కపూర్ ల సాంగ్ కు డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. సేమ్ టు సేమ్ అవే స్టెప్పులు.. అదే డ్యాన్స్.. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తేడా లేకుండా.. ఆ సాంగ్ లో గోవిందా, కరిష్మా ఏ స్టెప్పులైతే వేశారో.. పెళ్లి మండపం మీదనే అవే స్టెప్పులు వేసి కొత్త జంట అందరగొట్టేసింది. ఖుద్దర్ సినిమాలో గోవిందరా, కరిష్మా కపూర్ పాట తుమ్సా కోయి ప్యారా కోయి మాసమ్ కే వీళ్లు డ్యాన్స్ వేసింది.
Viral Video : కొత్త జంట కెమిస్ట్రీ అదుర్స్
ఓ ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా.. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ జంట నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. నిజంగానే వాళ్లు వేసే డ్యాన్స్ చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటుంది డ్యాన్స్ చూస్తే. మొత్తానికి పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వాళ్ల డ్యాన్స్ కు ఫిదా అయ్యారు.
Jodi is truly "Made for each other"#ShaadiMubarak pic.twitter.com/eDQk4a3hlo
— Dipanshu Kabra (@ipskabra) July 8, 2022
ఇక.. నెటిజన్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అబ్బ.. ఎంత బాగా డ్యాన్స్ చేశారు. మళ్లీ గోవిందా, కరీష్మా జోడీని గుర్తు చేశారు. నిజంగా గ్రేట్. రబ్ నే బనాదీ జోడీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మీరిద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టినట్టుగా ఉంది అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.