Priya Mani : ప్రియమణి అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రియమణి ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయింది. భాను ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో రావడం జరిగింది. తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతి బాబు తో జంటగా చేసి తన నటనతో అందంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాకి మదన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నటనకు గాను జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడంతో ప్రియమణికి క్రేజ్ మరింత పెరిగింది. తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రియమణి తన అందంతో అభినయంతో ముఖ్యంగా తన ముఖ కవళికలు తో ప్రేక్షకుల్ని థియేటర్ల కట్టిపడేస్తుంది.
తర్వాత 2010లో ప్రవరాఖ్యుడు అనే సినిమా జగపతి బాబు తోని చేసింది. తరువాత వచ్చిన సినిమా ద్రోణ. ఈ ద్రోణ సినిమాలో ఈ భామ బికినీలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ముఖ్యంగా అందచందాలతో బాగా ఆకట్టుకుంది. ద్రోణ సినిమా లో నితిన్ తో జంట కట్టి తన కెరీర్లో ఓ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రియమణి ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగులో దూసుకుపోయింది. తెలుగులో దర్శకేంద్రుడు రాజమౌళి తో యమదొంగ సినిమాలో jrఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేసి ఇ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. తరువాత ఆమెకు సినిమాలు వరుస కట్టాయి. వరుసగా సాధ్యం, గోలీమార్, శంభో శివ శంభో, క్షేత్రం, రగడ, చండీ సినిమాలు చేసుకుంటూ తెలుగులో బిజీ అయిపోయింది ఈ భామ.
Priya Mani : ఆ చూపులకి తట్టుకోలేరు.

ప్రియమణి ప్రస్తుతం బుల్లితెరపై అలరిస్తూ ఉంది. ఈ భామ ఎప్పుడూ తెలుగులో డీ షో లో న్యాయ నిర్ణేతగా చేస్తూ తన డాన్స్తో అలరిస్తూ ఉంది. ప్రియమణి కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. తను చేసిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది. తాను రీసెంట్ గా చేసిన ఒక ఫోటో షూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో షూట్ లో ఈ భామ తన ముఖకవళికల తోనే ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫొటోస్ చూసిన ప్రేక్షకులు తన అందాన్ని తట్టుకోలేము అని కామెంట్ చేస్తున్నారు.