ముస్లింతో పెళ్లి – షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి..!!

సినీ ఇండస్ట్రీలో నటీ, నటులపై ట్రోలింగ్ సహజమే. స్టార్ హీరో, హీరోయిన్స్ ఇందుకు మినహాయింపేమి కాదు. ఎంతోమంది ట్రోలింగ్ ను ఎదుర్కొన్నవారు ఉన్నారు. తాను కూడా ట్రోలింగ్ ఎదుర్కొన్నానని స్టార్ హీరోయిన్ ప్రియమణి వెల్లడించింది.

Advertisement

కెరీర్ పరంగా ట్రోల్స్ ను ఎదుర్కొనే వారు కొందరైతే, వ్యక్తిగత విషయాల్లో ట్రోల్స్ బాధితులు మరికొందరు. అయితే పర్సనల్ విషయాల్లోకి దూరి ట్రోల్స్ చేస్తే ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ట్రోలర్స్ ఇవేమీ పట్టించుకోకుండా ట్రోల్స్ చేస్తుంటారు.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణి తన వ్యక్తిగత విషయం గురించి నెటిజన్లు ట్రోల్స్ చేశారని వెల్లడించింది. పెళ్లి అంశంలో నోరు పారేసుకున్నారని తెలిపింది. నిజానికి నేను ట్రోలింగ్ ను పట్టించుకోను. బాడీ షేమింగ్ విషయంలో నాపై విమర్శలు వస్తున్నాయని ప్రియమణి తెలిపింది.

నేను, ముస్తఫాను ప్రేమ వివాహం చేసుకున్నా. ఆ సమయంలో సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నా. మా ఎంగేజ్ మెంట్ ఫోటోలు షేర్ చేసినప్పుడు ” నువ్వు ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు..? అని నా పర్సనల్ విషయాల గురించి ప్రశ్నించారని ఆవేదన వెలిబుచ్చింది ప్రియమణి.

ఇలా నాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసే వారికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా లైఫ్. నాకు నచ్చిన వ్యక్తితో నేను ప్రయాణిస్తా. అది నా ఇష్టం. దయచేసి నా పర్సనల్ అంశాల్లో తలదూర్చాలని ప్రయత్నించకండి అని ఆమె స్పష్టం చేశారు.

Also Read : ఆ హీరోకు అంగస్థంభన సమస్య- సెక్స్ కోసం భర్తతో ఆ హీరోయిన్ గొడవ..?

Advertisement