చనిపోయిన వ్యక్తులను మళ్ళీ బతికించువచ్చు – ఎలాగంటే..?

మరణం తరువాత కూడా మళ్ళీ బ్రతకాలని కోరుకునే వారు చాలామందే ఉంటారు. ఇన్నాళ్ళు అలాంటివి సాధ్యం కాదనుకున్నాం కానీ, ఇప్పుడు వాటిని సుసాధ్యం చేసే పనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కృషి చేస్తున్నాయి.

Advertisement

మరణం తరువాత మళ్ళీ జీవించాలనే ఆసక్తి మానవాళిలో పెరగడం ప్రారంభమైంది. ఇందుకోసం ఏం చేయాలని…అభివృద్ధి చెందిన దేశాలలో ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఇక్కడి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు సాయంతో మరణం తరువాత ఏ వ్యక్తినైనా బతికించవచ్చునని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వివిధ స్థాయిల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి పరిశోధనలను మెజార్టీ శాస్త్రవేత్తలు తిరస్కరిస్తున్నారు.

Advertisement

క్రయోనిక్స్ సౌకర్యం : చనిపోయిన వ్యక్తిని బ్రతికించే ఏర్పాటును క్రయోనిక్స్ సౌకర్యం అంటారు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం మృతదేహాన్ని భద్రంగా ఉంచుతారు. ఓ స్టీల్ బాక్స్ లో ఉంచి నైట్రోజన్ తో నింపి ఉంచుతారు. ఈ పరిశోధనలో భాగంగా అమెరికాలో దాదాపు 200మృతదేహాలను భద్రపరిచారు. చావుకు దగ్గరైన కొంతమంది మళ్ళీ జీవించాలనే ఆశతో ఈ ప్రక్రియ కోసం 1500మంది అప్లై చేసుకున్నారు.

ఈ పరిశోధనలు విజయవంతమై మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతికితే అతను పాత విషయాలను గుర్తుంచుకోగాలడా..? అనే విషయం శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టకుండా ఉంది.

Also Read : eyesight-ఏడు రోజులలో మీ కంటి చూపును 90% పెంచుతుంది ఈ చిట్కా…

Advertisement