DVV Danayya : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు డీవీవీ దానయ్య. తాజాగా ఆయన కొడుకు కళ్యాణ్ ఓ ఇంటి వాడు అయ్యాడు. సమత అనే అమ్మాయిని ఈనెల 20 వ తారీఖున పెళ్లి చేసుకున్నాడు. ఈ శుభకార్యానికి పలువు సినీ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. ఇకపోతే కళ్యాణ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జాంబీ రెడ్డి, కల్కి సినిమాలతో డైరెక్టర్ పరిచయమైన ప్రశాంత్ వర్మ ఇప్పుడు నిర్మాత డివివి దానయ్య కొడుకుతో అధిరా సినిమా చేస్తున్నాడు. సైంటిఫిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
శ్రీమతి చైతన్య సమర్పణలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన అధీరా టీజర్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది. అధిరా టీజర్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరు కళ్యాణ్ కొత్త సినిమాతో, పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అదృష్టం అంటే ఇతనిదే అని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో దానయ్య పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగి పోయింది. రాజమౌళితో సినిమా చేయడం కోసం దానయ్య 2006లోనే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు దానయ్య.
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం డీవీవీ దానయ్య పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కొత్త పెళ్లికొడుకు అధీరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరీ ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి. తొలి సినిమాతోనే కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. మొదటి సినిమాతో కళ్యాణ్ హీరోగా నిరూపించుకుంటాడో లేదో చూడాలి.