Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నయి. అయితే ఈ మధ్యకాలంలో తిండికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మరింతగా ట్రెండ్ అవుతున్నాయి. తక్కువ టైంలో ఎక్కువ ఆహారాన్ని తినే పోటీలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోటీలు అప్లోడ్ చేస్తూ తద్వారా లైక్స్ వ్యూస్ పొందుతున్నారు. యూట్యూబ్ ద్వారా కూడా ఈ పోటీలను ప్రేక్షకులకు షేర్ చేస్తున్నారు. సాధారణంగా బిర్యానీ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ తింటూ పోటీలు జరుగుతున్నాయి.
Viral Video : వీడు కుంభకర్ణుడికి కజిన్ లా ఉన్నాడు…
అయితే మనం ఇప్పుడు చూడబోయే వీడియోలు ఏకంగా ఒక వ్యక్తి ఐదు నిమిషాలలో మూడు కేజీల భారీ సమోసాని తిని 11 వేల రూపాయలు నగదు గెలుచుకున్న యూట్యూబ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో లక్షక పైగా వ్యూస్ కొల్లగొట్టింది. ఆర్ యు హంగ్రీ అనే పేరుతో ఫేస్బుక్ పేజీ మరియు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రజినీస్ జ్ఞాని అనే వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో హోటల్ ఓనర్ తో పందెం నిర్వహించి గెలుచుకున్నాడు. అదే హోటల్లో మూడు కేజీల భారీ సమోసాని తయారు చేసి ఇంకా తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తి ఐదు నిమిషాలలో మూడు కిలోలు ఉన్న సమోసాలు తింటున్న విధానం మొత్తం వీడియో తీసి మనకు చూపించడం జరిగింది.

ఈ వీడియోలో అత్యంత కష్టంగా సమోసానికి తింటూ మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఏకంగా ఈ భారీ సమోసాని ఐదు నిమిషాలలో హాంఫట్ చేసేసాడు. సమోసాని తిన్న తర్వాత ఆ రెస్టారెంట్ యజమాని రజినీస్ జ్ఞానీకి 11వేల రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగింది. మొత్తం వీడియోని యూట్యూబ్ లో షేర్ చేసిన తర్వాత మొత్తం లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఒక్కడు గెలిచిన 11,000 నగదు బహుమతిని తన ఛానల్ కోసం తదుపరి చేయబోయే వీడియోలు కోసం వినియోగిస్తానని చెప్పాడు. మీరు కూడా ఈ వీడియోని ఓ లుక్ వేసుకోండి…