Rakhul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ పొందలేదు. తరువాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్ తో జతకట్టి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఈ భామ తన అందంతో కుర్రకారు ఆకట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తరువాత లౌక్యం సినిమా తో గోపీచంద్ తో జతకట్టి తన అందంతో నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత కరెంటు తీగ సినిమా లో మనోజ్ తో నటించి ఈ సినిమాలో తన అందాల ఆరబోతతో తెలుగులో మంచి హిట్ కొట్టింది.
తర్వాత పండగ చేస్కో సినిమా లో రామ్ తో కలిసి నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ భామకి తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. తరువాత రవితేజ కిక్ 2 లో తన నటనతో ప్రేక్షకులని బాగా అలరించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. రకుల్ ప్రీత్ వెంటనే రామ్ చరణ్ తో బ్రూస్ లీ అనే సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తో చేసిన రొమాన్స్ తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
Rakhul Preeth Singh : వైట్ కలర్ డ్రెస్ లో అందాల రకుల్.

రకుల్ ప్రీత్ తర్వాత ఎన్టీఆర్ తో నటించిన నాన్నకు ప్రేమతో సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టేసి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. అలానే సరైనోడు, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సినిమాలతో వరుసగా చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ భామ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకుల్ ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకోవడం జరిగింది ఈ ఫోటో షూట్ లో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటో చూసి నెటిజన్లు తన అందాన్ని పొగుడుతూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.