Crying May Benefits Your Health : మనిషికి బాధ కలిగిన, మనసుకు గాయం ఏర్పడ్డ, దెబ్బ తగిలిన ప్రతి వ్యక్తి చేసే పని ఏడవడం. ఇంట్లో మగ పిల్లలు ఏడిస్తే ఏంట్రా ఆడపిల్లల ఏడుస్తున్నావు అని అంటుంటారు. అయితే.. అమ్మాయి ఏడిస్తే ఇంటికి దరిద్రం అంటూ తల్లిదండ్రులు, బంధువులు ఇలా చెబుతుంటారు. కానీ ఏడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మనసుకి బాధ కలిగినప్పుడు తనివి తీరా ఏడవండి అంటూ కూడా సలహాలు ఇస్తారు. అసలు ఏడవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఏడవటం వల్ల తెగిపోయిన బంధాలతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కలిసో అవకాశం ఉంటుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. బాధ కలిగినప్పుడు ఏడవడం వల్ల సృజన శక్తి పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ప్రతి చిన్న విషయానికి సున్నితమైన మనసు ఉన్నవారు ఏడుస్తూ ఉంటారు. ఇలా ఏడవడం వల్ల ఆ వ్యక్తిలో ఆలోచన శక్తి పెరగటంతో పాటు సృజన శక్తి కూడా అధికమవుతుంది. ఒక వ్యక్తి బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న కంటి వెంట నీరు కారుతూ ఉంటుంది.
Crying May Benefits Your Health : ఏడవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట

అలాంటి సమయంలో ఆ వ్యక్తి తనివి తీర ఏడవాలని దీనివల్ల ముందుకు సాగే ధైర్యం మరింత వస్తుందని తెలియజేశారు నిపుణులు. మానవ శరీరంలో లాలాజలం, తల్లిపాలు, వీర్యంతో పాటు మనం కార్చే కన్నీరు లో కూడా లైసో జై అనే ప్రోటీన్ ఉంటుందట. ఈ ప్రోటీన్ మన బాడీలో ఉండే బ్యాక్టీరియాని చంపేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. ఏడవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇకనుంచి ఆలాంటి సందర్భాల్లో తనివి తీర ఏడవండి అంటూ ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.