Viral Video : అది రోడ్ సైడ్ ఉన్న ఓ రెస్టారెంట్. ఫుట్ పాత్ మీద ఉన్న ఆ రోడ్ సైడ్ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లు.. టేబుల్స్ దగ్గర కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఆరగిస్తున్నారు. టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అందరూ సీరియస్ గా తమ ఫుడ్ ను తింటున్న సమయంలో ఒక ఘటన జరిగింది అక్కడ. కొందరు వ్యక్తులు ఆ రోడ్డుపై జాగింగ్ చేస్తూ పరుగెడుతున్నారు. వాళ్లను చూసిన హోటల్ కస్టమర్లు షాక్ అయ్యారు. ఏమైందో అనుకున్నారు. వాళ్లను చూసి కొందరు హోటల్ లోని కస్టమర్లు కూడ తినేది మధ్యలోనే వదిలేసి పరుగులు అందుకున్నారు. వాళ్లను చూసి మిగితా కస్టమర్లు కూడా పరుగు లంఖించుకున్నారు.
ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అంతే కాదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. చెర్ వెజారియా అనే రెస్టారెంట్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Viral Video : మరీ ఇంత భయమా? అని కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
నిజానికి ఆ రెస్టారెంట్ మధ్య ఉన్న ఫుట్ పాత్ నుంచి కొందరు జాగింగ్ చేస్తూ పరిగెత్తారు. వాళ్లను చూసి ఎవరైనా వాళ్లను తరుముతున్నారో లేక ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డ రెస్టారెంట్ లో ఉన్న కస్టమర్లు కూడా ఏమాత్రం ఆగలేదు. వాళ్లు ఎందుకు పరిగెత్తారో తెలియక.. ఆ రెస్టారెంట్ లో తింటున్న వాళ్లంతా అక్కడి నుంచి పరిగెత్తారు. అసలు.. వీళ్లంతా ఎందుకు పరిగెడుతున్నారో తెలియక రెస్టారెంట్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వార్నీ ఇంత భయమా.. అసలు ఇంత భయంతో ఈ భూమి మీద ఎలా బతుకుతారు మీరు సామీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
A group of people doing CrossFit ran passed a restaurant
Dozens of diners thought they were escaping from something and abandoned their tables to run off too. This happened in Brazil 1/????pic.twitter.com/7lmpt2zHY7
— Science girl (@gunsnrosesgirl3) September 25, 2022