Virat Kohli – Anushka Sharma : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటైన ఈ ప్రేమ జంట 2021లో వామికా కు జన్మనిచ్చింది. ఇక వామికా పుట్టి రెండేళ్లు దాటుతున్న ఇప్పటికీ ఆమె ఫోటోలను అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాక వారు షేర్ చేసిన ఫోటోలలో వామిక ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితమే విరుష్క దంపతులు ముంబైలోని గైనకాలజీ క్లినిక్ కు వెళ్లినట్లు సమాచారం. అనుష్క ప్రెగ్నెంట్ కాబట్టే దంపతులు హాస్పిటల్ కి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాక నవంబర్ 5 న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తను అభిమానులతో పంచుకునే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి. ఇక అనుష్క ప్రెగ్నెంట్ అనే విషయానికి రుజువు ఇదే అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అనుష్క మీడియా ముందు కనిపించడం లేదని, విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్ లకు ప్రత్యేకంగా హాజరయ్యే అనుష్క…ఆసియా కప్ 2023లో ఒక్క మ్యాచ్ ము కూడా స్టేడియం కి రాలేదని, ఇవన్నీ చూస్తుంటే అనుష్క ప్రెగ్నెంట్అనే విషయాన్ని వారు గోప్యంగా ఉంచుతున్నట్లు అర్థమవుతుందని చెబుతున్నారు. అంతేకాక ఇటీవల ఓ నేటిజన్ వినాయక చవితి సందర్భంగా అనుష్క విరాట్ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ…
అనుష్క బేబీ బంప్ కనిపిస్తుందని ,వీరిద్దరూ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ గా మారింది.ఇది ఇలా ఉండగా మరో 4 రోజుల్లో వండే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్ లో మొత్తం 10 జట్టులు పాల్గొనబోతున్నాయి. అక్టోబర్ 8న జరగబోయే మ్యాచ్ తో భారత్ వేట ప్రారంభం కానుంది. ఇక గత ఏడాది ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇటీవల జరిగిన ఆసియా కప్ 2023లో కూడా విజృంభించి ఆడాడు. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక వండే వరల్డ్ కప్ లో కూడా విరాట్ కోహ్లీ ఇదే జోర్ ను కనబరచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Exclusive : Virat Kohli & Anushka Sharma are going to be parents again.Anushka's Baby Dump is quite visible ! Baby Kohli is arriving ❤️#ViratKohli #AnushkaSharma #ICCWorldCup2023 #Tiger3 #Dunki #LeoTrailer #Prabhas #Salaar #Mohanlal #LeoDas pic.twitter.com/MvxagEF5HK
— Vishwajit Patil (@_VishwajitPatil) September 30, 2023