Ponnniyin Selvan Telugu Review : పొన్నియిన్ సెల్వన్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Ponnniyin Selvan Telugu Review : సినిమా పేరు : పొన్నియిన్ సెల్వన్(దొంగలున్నారు జాగ్రత్త)

Advertisement

డైరెక్టర్ : మణిరత్నం

Advertisement

నటీనటులు : విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రభు, ఆర్ శరత్ కుమార్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, ప్రకాశ్ రాజ్ తదితరులు

ప్రొడ్యూసర్స్ : లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్

మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహమాన్

విడుదల తేదీ : 30 సెప్టెంబర్ 2022

చరిత్రకు సంబంధించిన సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇటీవలే బింబిసారుడి ఆధారంగా వచ్చిన సినిమా బింబిసార. అది తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా తమిళంలో చోళరాజుల నేపథ్యంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా వచ్చిందే ఈ మూవీ. మణిరత్నం ఈ నవలను బేస్ చేసుకొని పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను రెండు పార్టులగా కేవలం 150 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. తొలి పార్ట్ ను తాజాగా విడుదల చేశారు. నిజానికి ఇది తమిళం మూవీ. కానీ.. తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. కానీ.. తెలుగు ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ ఈ సినిమాలో చాలా తక్కువ.

ponniyin selvan 1 movie review and rating
ponniyin selvan 1 movie review and rating

అయితే.. తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. అలాగే.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చింది. త్రిష, కార్తీ, విక్రమ్, జయం రవి, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో సినిమాకు క్రేజ్ పెరిగింది. మరి.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Ponnniyin Selvan Telugu Review : సినిమా కథ ఏంటంటే?

ఈ కథ దాదాపు వెయ్యి సంవత్సరాల కింద జరిగింది. పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంలో చోళ రాజ్యానికి క్రౌన్ ప్రిన్స్ గా ఆదిత కారికాలన్ ఉంటాడు. ఆదిత కారికాలన్ పాత్రను విక్రమ్ పోషించాడు. విండియతేవన్(కార్తీ) లేఖను అందించడానికి చోళ రాజ్యంలో అడుగు పెడతాడు. చోళ రాజ్యానికి రక్షకుడుగా అరుణ్మోళి వర్మ(జయం రవి) ఉంటాడు. చోళ రాజ్యంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని తెలిసి కుందవాయ(త్రిష) అక్కడ రాజకీయ ప్రశాంతతను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే.. చోళ సామ్రాజ్యంలో అంతర్యుద్ధం వస్తుందా? అప్పుడు అరుణ్మోళి వర్మ చోళ రాజ్యాన్ని కాపాడుతాడా? నందని(ఐశ్వర్యారాయ్) ఎవరు? ఆదిత కారికాలన్ కు లేఖ అందించడానికి వెళ్తూ కదంపూర్ అనే భవనంలో ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనకు, కుందవాయి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, ఐశ్వర్యారాయ్ అద్భుతంగా నటించారు. వాళ్తు తమ పాత్రల్లో జీవించారు. ఇక.. టెక్నికల్ గా చూసుకుంటే ఇది ఒక అద్భుతమైన కథ. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. చరిత్రకు సంబంధించిన సినిమా అయినా కూడా ఎక్కడా ప్రేక్షకుడు బోర్ ఫీలవకుండా సినిమాను తీయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం సాగదీసినట్టుగా ఉంటాయి.

యువతరం రేటింగ్ : 2.75/5

Advertisement