Samantha : హీరోయిన్ సమంత హెల్త్ పై గత కొన్ని వారాల నుండి కొన్ని పుకార్లు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సమంత స్కిన్ సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని.. అందుకే ఆమె అసలు బయట కనిపించడం లేదని వార్తలు తెగ జోరుగా నడుస్తున్నాయి. అయితే సమంత మేనేజర్ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. పలువురు సమంత పై కావాలనే రాంగ్ కామెంట్స్ పెడుతున్నారు. సమంతా కి ఎటువంటి స్కిన్ సమస్య లేదు. ఆమె చాలా హెల్దిగా ఉన్నారు. తొందర్లోనే షూటింగ్ లో కి జాయిన్ అవుతారు. ఆమెపై రాంగ్ సమాచారాలను క్రియేట్ చేస్తున్న వాళ్లపై లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అని సమంత అంటున్నారు అని ఆయన తెలిపారు.
అయితే ఈ మధ్యకాలంలో సమంత హెల్త్ పై అటువంటి సమాచారాలు తెగ హల్చల్ అవుతున్నాయి. చర్మానికి సంబంధించిన జబ్బుతో ఆమె ఇబ్బంది పడుతుందని ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్లడానికి రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక దీంతో సమంత హెల్త్ పై వస్తున్న పుకార్లు పై సమంత మేనేజర్ ఇంకొకసారి రియాక్ట్ అయ్యాడు. ఆ సమాచారలలో ఎటువంటి వాస్తవం లేదని ఆమె ఎంతో ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉన్నారని. ఆయన తెలియజేశాడు. అయితే ఆమె అమెరికాకు దేనికి వెళుతుందనే విషయంపై సమంత మేనేజర్ రియాక్షన్ ఇవ్వలేదు.
Samantha : సామ్ హెల్త్ పై మళ్లీ రూమర్స్…
ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ప్రాజెక్టులకు ఓకే చెప్పేసిందట ఈ అమ్మడు. ఈమె కొన్ని కీలక పాత్రలు చేస్తున్న పాన్ ఇండియా సినిమా శకుంతలం యశోద మూవీలు పోస్ట్ ప్రొడక్షన్ భాగంలో ఉంది. అలాగే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో జతకట్టి ఓ వెబ్ సిరీస్ లో కూడా చేస్తుండగా… ఆయుష్మాన్ ఖురాన్ తో కలిసి ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఎన్నో సినిమాలకు ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ హిట్ల మీద హిట్లు అందుకుంటూ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు అమెరికాకి ఎందుకు వెళ్ళింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.