Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి వరుణ్ తేజ్ నటించిన ‘ ఫిదా ‘ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. లేడీ పవర్ స్టార్ గా తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. తెలుగుతోపాటు మలయాళం, తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది.
ఈ మధ్యనే ఈ అమ్మడు రానా నటించిన విరాటపర్వం సినిమా తో పాటు గార్గి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. హీరోయిన్ అందరిలో సాయి పల్లవి రూట్ సపరేట్ గా ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా స్క్రిప్టులో ఆమెకు వాల్యూ లేకపోతే నో చెప్పేస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకుంటుందా కానీ సాయి పల్లవి ఈజీగా నో చెప్పింది. అయితే నానితో వచ్చినా శ్యామ్ సింగరాయ్ సినిమా యావరేజ్ గా అనిపించినా ఆ తర్వాత వచ్చిన విరాటపర్వం గార్గి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
Sai Pallavi : ఆ హీరో కి మాత్రమే ముద్దు పెట్టిన సాయి పల్లవి… ఎవరై ఉంటారు…!

సాయి పల్లవి తన సినిమాలు డిజాస్టర్ అయిన తన స్టైల్ మాత్రం మార్చుకోదు. రొమాంటిక్ సీన్స్ లో నటించడం, ఎక్స్ పోజింగ్ చేయడం వంటివి చేయదు. కిస్ సీన్స్ అయితే చాలా దూరంగా ఉంటుంది. అయితే తన కెరీర్ లో సాయి పల్లవి ఒకే ఒక్క హీరోకి ముద్దు పెట్టింది. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ కి ముద్దు పెట్టిన లవ్ స్టోరీ సినిమాలో చైతుకి లిప్ కిస్ పెట్టింది. కొన్ని కండిషన్స్ తో సాయి పల్లవి అతనికి లిప్ లాక్ ఇచ్చింది. ఏదేమైనా సాయి పల్లవి నాగచైతన్య కి మాత్రం అలా కిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.