Sai Pallavi : సాయి పల్లవి ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషల్లో మంచి పేరును సంపాదించుకుంది. ఈ నటి నటనలోనూ మరియు నాట్యంలోనూ ఈమెకు సాటి ఎవరూ లేరు . సాయి పల్లవి డాన్స్ లో నాట్య మయూరి . ఆమె లాగా ఏ హీరోయిన్ ను కూడా డాన్స్ వేయలేవరు అంత బాగా వేస్తుంది మరి . డాన్స్ సాయి పల్లవి డాన్స్ చూస్తే మరో హీరోయిన్స్ కుళ్లుకుంటారు. ఈమెకు అంత టాలెంట్ ఉంది .అంతే నటనలో కూడా జీవించిపోతుంది . ఆమె పాత్రకు తగ్గట్టు జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది .
అయితే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు గార్గి మూవీలో నటిస్తుంది . ఇటీవల కాలంలో విరాటపర్వంతో ప్రేక్షకుల్ని అలరించింది . ఈ మూవీలో సాయి పల్లవి వెన్నెలగా పాత్రను పోషించింది .సినీ ప్రియులతో మరియు విమర్శకుల నుంచి కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అదే జోష్ తో ఇప్పుడు గార్గితో ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో గౌతమ్ రామచంద్ర తెరకెక్కించిన బహుభాషా చిత్రమిది. అయితే టుడి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూపర్ స్టార్ అయిన సూర్య మరియు జ్యోతిక చేతులు మీదుగా విడుదల చేస్తున్నారు.
Sai Pallavi : విడుదలకు సిద్ధం అయిన సాయి పల్లవి గార్గి మూవీ

ఈ మూవీని ఈనెల జూలై 15న ప్రేక్షకులకు ముందుకు తేవడానికి డేట్ ఫిక్స్ చేశారు. సండే రోజున ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ను నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ చిత్రం న్యాయవ్యవస్థ చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందించుకున్నది. ఈ మూవీ కథాంశం చాలా ఆసక్తికరమైనది. ఈ చిత్రం తమిళం, కన్నడ ,తెలుగు పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ మూవీకి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు.