Samantha : సమంత ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో కొత్త వార్త గందరగోళాన్ని సృష్టించింది. సామ్ తన వ్యక్తిగత విషయాలను అలాగే ఫొటోస్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే సోమవారం రాత్రి తన అకౌంట్ నుంచి ఒక కొత్త ఫోటో వచ్చినట్లు నెట్టింట అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఆ ఫోటో మన తెలంగాణ కెసిఆర్ తనయుడు కేటీఆర్ ఫోటో అలాగే నా ప్రజలే నా బలం, నా ధైర్యం ,నా నమ్మకం అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో సమంత ఫాలోవర్స్ అందరూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. తన అకౌంట్ నుంచి ఈ ఫోటో రావడం ఏంటి అని సందేహలకు గురయ్యారు. అలాగే మీడియాలో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. తను రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడదు అలాంటిది ఇలా పోస్ట్ ఎందుకు వచ్చింది అని ఫాలోవర్స్ సందిగ్ధంలో పడ్డారు.
Samantha : సమంత తన ఇన్ స్టాగ్రామ్ హ్యక్, క్షమాపణలు చెప్పిన సామ్ టీమ్.
ఈ నేపథ్యంలో సమంత ఇన్ స్టా అకౌంట్ టీమ్ రంగంలోకి దిగి సమంత ఫాలోవర్స్ కు సమాధానం ఇలా ఇచ్చారు. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేసినందువలన ఈలాంటి పోస్ట్ తన అకౌంట్ నుంచి రిలీజ్ అయింది. దీనికి కారకులు ఎవరో పట్టుకుంటామని శ్యాం ఇనిస్టా అకౌంట్ హ్యాండిల్ టీం డిజిటల్ మేనేజర్ శశాంక క్షమాపణలు చెబుతూ రిలీజ్ చేశారు