Viral Video : వామ్మో.. 5 ఏళ్ల బాలుడిని చితకబాదిన మాస్టారు.. ఇంత ఘోరంగా కొట్టి మరీ చదువు చెబుతారా?

Viral Video : తల్లిదండ్రుల తర్వాత దేవుడిగా భావించేవాళ్లు గురువులు. అవును.. విద్యాబుద్ధులు నేర్పిస్తారు కాబట్టి వాళ్లను దేవుళ్లుగా భావిస్తాం. సమాజంలో ఎలా బతకాలి.. ఎలా చదువుకోవాలి.. క్రమశిక్షణ అన్నీ వాళ్ల నుంచే నేర్చుకుంటాం. మన జీవితానికి ఒక దారి చూపేది వాళ్లే కాబట్టి వాళ్లను దేవుళ్లతో సమానంగా చూస్తాం.

tuition master beat student video viral in bihar patna
tuition master beat student video viral in bihar patna

కానీ.. నేడు ఆ గురువులే దారి తప్పుతున్నారు. పిల్లలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది గురువులు విద్యార్థులపై తమ ప్రతాపాన్ని చూపించిన ఎన్నో ఘటనలను చూశాం. తాజాగా ఓ ట్యూషన్ మాస్టర్ చేసిన ఘాతుకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : పిల్లాడిని కర్రతో చితకబాదేశాడు

బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్లు కూడా ఉండవు. ఆ పిల్లాడిపై తన ప్రతాపాన్ని చూపించాడు.. రాక్షసుడిలా ప్రవర్తించాడు. పెద్ద కట్టెతో వెనుక వైపు పిల్లాడిని ఘోరంగా కొట్టడంతో ఆ కట్టె కూడా రెండు ముక్కలు అయింది. ఆ తర్వాత మళ్లీ చేతులతో పిడి గుద్దులు గుద్దాడు. తీవ్రంగా కొట్టాడు.

వద్దు అంటూ ఆ పిల్లాడు ఎంత వేడుకున్నా అతడు మాత్రం అస్సలు కనికరించలేదు. జుట్టు పట్టుకొని ఈడుస్తూ తీవ్రంగా కొడుతుండటాన్ని అక్కడే ఉన్న మిగితా విద్యార్థులు కూడా చూసి జడుసుకున్నారు. అయితే.. ఈ ఘటనను ఓ వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ బాలుడిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు.. ఆ ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి అతడిని చితక్కొట్టారు. ఆ ఘటన జరిగింది ఓ ట్యూషన్ సెంటర్ లో. అసలు.. ఆ విద్యార్థిపై అతడు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తించాడో కారణాలు తెలియదు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.