Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణది ఓ విలక్షణమైన పందా నడుస్తూ ఉంటుంది… నందమూరి నటసింహం తన డైలాగులకు మరియు మాస్ స్టెప్పులతో తన సినిమాలో అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలోనే అఖండ సినిమాతో భారీ హిట్ ని అందుకున్న బాలయ్య ఇప్పుడు పలు ప్రాజెక్టుల మీద కాన్సెంట్రేట్ చేసి బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఓటీటీ లో టాక్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఓ టీ టీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలు అన్ స్టాపబుల్ షోలో తనదైన స్టైల్ లో టాక్ షో నిర్వహిస్తూ మొదటి సీజన్ మొత్తం వావ్ అనిపించాడు. తెలుగు చిత్ర సీమలో టాప్ హీరోలైన మహేష్ బాబు మరియు రవితేజ తో చేసిన ఎపిసోడ్స్ చాలా హైలెట్ గా నిలిచాయి.
అంతేకాకుండా మంచు మోహన్ బాబుతో చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పాపులర్ అయింది. అన్ స్టాపబుల్ మొదటి మొదటి సీజన్ బాగా హిట్ కావడంతో రెండో సీజన్ కోసం అదే ఊపుతో అంతా సిద్ధం చేశారు యాజమాన్యం వారు. అయితే రెండో సీజన్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయాలనే ఆలోచన లో ఆహా యాజమాన్యం ఉంది. సమంత, అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఆమె అన్ని సినిమాల్లో చాలా ఘాటైన పాత్రలు చేసింది. ఇంకా తన అందాల ఆరబోతలో డోస్ పెంచేసింది. కాగా అన్ స్టాపబుల్ షోలో నందమూరి బాలకృష్ణ ఇలా హాట్ గా కనిపించడం పై ఆసక్తికరమైన టాక్ నడుస్తుంది అని అంటున్నారు.
Samantha : బాలకృష్ణ షోలో అక్కినేని ఫ్యామిలీ గురించి తప్పుగా చెప్పబోతుందా…

అంతేకాకుండా ఈ సీజన్ టు ను సమంతతో స్టార్ట్ చేస్తే షోకి బాగా హైట్ వస్తుందని అందరూ అంటున్నారు. కాగా కాఫీ విత్ కరణ్ షోలో చైతన్య తోని విడిపోవడానికి గల కారణాలు అడగగా ఆమె చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. అంతేకాకుండా ఆమె చెప్పిన విషయాలలో నాగచైతన్య పై ఆమె కోపమే కనపడింది. కానీ అదే షో కి నాగ చైతన్య వెళ్లినప్పటికీ చాలా కూల్ గా స్పందించాడు. ఒకవేళ సమంత కనిపిస్తే తన హాయ్ చెప్పి హగ్ ఇస్తానని చెప్పిన సమాధానం తో అందరూ ఆశ్చర్యపోయారు. కాగా అనుష్టాపబుల్ టూ లో బాలయ్య సమంతని ఎటువంటి క్వశ్చన్ లు అడగబోతున్నాడు ఇలాంటి ప్రశ్నలు అడగగలరా లేదా అనేది ఆసక్తి నెలకొంది. ఒకవేళ బాలయ్య ఇలాంటి ప్రశ్నలు అడిగితే అక్కినేని ఫ్యామిలీ గురించి తప్పుగా చెప్పనుందా అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి షో అయ్యే వరకు ఉత్కంఠ నెలకొంది.