Diabetes : భారతదేశంలో చాలామంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. వృద్ధులతో పాటు యువతలు కూడా ఈ వ్యాధికి గురి అవుతున్నారు. డయాబెటిస్ వ్యాధి నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తప్పనిసరి. తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి.. ఈ వ్యాధి వచ్చినట్లు చాలామందికి తెలియడం లేదు. అందువల్ల డయాబెటిస్ గురించి జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు ను తెలుసుకున్నారు నిపుణులు. వీటి ప్రకారం డయాబెటిస్ వ్యాధిని తగ్గించుకోవాలంటే రోజు ఒక గ్లాస్ పాలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
తరచుగా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల పది శాతం మధుమేహం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఓ పరిశోధనలో పాల్గొన్న సైంటిస్టులు వెల్లడించారు. రక్తంలో ఉండే గ్లూకోస్ ని శక్తిగా మార్చే సామర్థ్యం తో పాటు పలు పోషకాలు పాలలో ఉంటాయని తెలియజేశారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. లేదంటే ఇది మన గుండె, కళ్ళకు ప్రమాదంగా మారుతుంది. రక్తంలో సుగర్ లెవెల్స్ పెరగడం వల్లనే కంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండె జబ్బులు, స్టోక్ ప్రమాదం కూడా పెరగవచ్చు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం..
Diabetes : మధుమేహం సమస్యతో బాధపడేవారు పాల ను ఇలా తీసుకున్నారంటే..
ప్రపంచంలో 55 కోట్ల మంది ప్రజలు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి కారణం కూడా తెలుసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు 10% తగ్గుతుందని ఓ పరిశోధనలో వెలువడింది. అదేవిధంగా ఏదైనా పాల ఉత్పత్తిలో 150 గ్రాముల ఈ వ్యాధిని ఐదు శాతం తగ్గిస్తుందని వెలువడింది. పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, పోషకాలతో పాటు ఎన్నోరకాల బయో యాక్టీవ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయని, ఇవి గ్లూకోస్ ని శక్తిగా మార్చడంలో తమకు పాత్ర వహిస్తాయని చెబుతున్నారు సైంటిస్టులు