Samantha : సమంతకి ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్..!

Samantha : ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే కనీసం వంద రోజులు ఆడాల్సిందే. చాలా థియేటర్లలో సినిమాలు వంద రోజులకు మించి ఆడేవి. కానీ.. జనరేషన్లు మారాయి. ఈ జనరేషన్ ఓటీటీకి అలవాటు అయిపోయింది. డైరెక్ట్ గా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయని.. థియేటర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని సినిమా చూడొచ్చు అనేది ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ రూపురేఖలు కూడా మారిపోయాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఒక వారం పాటు థియేటర్లలో ఆడిందంటే చాలా గొప్ప. వారం పాటు ఆ సినిమాను థియేటర్లలో ఆడించడం పెద్ద సవాల్ గా మారిపోయింది.

Advertisement
samantha yashoda movie collections dropped
samantha yashoda movie collections dropped

దానికి ఉదాహరణ ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలను తీసుకోవచ్చు. ఇప్పుడు యశోద సినిమా వంతు వచ్చింది. ఈ సినిమా సమంత కెరీర్ లోనే బెస్ట్ మూవీ అంటూ.. తన పర్ఫార్మెన్స్ ఎట్ పీక్స్ అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. కానీ.. సినిమా విడుదలైన మూడు నాలుగు రోజులకే చాలా డ్రాప్ కనిపిస్తోంది.

Advertisement

Samantha : సూపర్ స్టార్ కృష్ణ మరణం జనాల మూడ్ ను టర్న్ చేసిందా?

నిజానికి.. యశోద సినిమా బాగానే ఉంది. సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు మూడు రోజులు సినిమా బాగానే నడిచింది కానీ.. ఎప్పుడైతే సూపర్ స్టార్ కృష్ణ మరణించారో.. అప్పటి నుంచి యశోద సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయట. దానికి కారణం.. జనాలు మొత్తం కృష్ణ అంత్యక్రియలకు సంబంధించిన న్యూస్ చూడటం, ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. చాలామంది సినీ అభిమానులు కృష్ణ మరణంపై బాధపడ్డారు. ఆయన గురించి చర్చించారు. కొన్ని థియేటర్లలో అయితే రెండు మూడు షోలను కూడా రద్దు చేశారు. కొన్ని థియేటర్లను మూసేశారు కూడా. దీంతో ఒక్కసారిగా కలెక్షన్స్ పడిపోయాయి. ఇప్పటి వరకు యశోద సినిమాకు పది కోట్ల వరకు షేర్ వచ్చిందట. బ్రేక్ ఈవెన్ కు ఇంకో కొటిన్నర వస్తే చాలు. ఇంతలో కృష్ణ మరణించడంతో యశోద కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఓవైపు సినిమా బాగానే ఉందని టాక్ వచ్చినా కలెక్షన్స్ లేకపోవడం సమంతకు పెద్ద మైనస్ పాయింట్ అయింది.

Advertisement