Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత మరొక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని రెడీ అవుతున్నాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ త్రివిక్రమ్ చెప్పిన కథ పాన్ ఇండియా స్థాయిలో లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టి కొరటాల శివ చెప్పిన కథకి ఓకే చేశాడు. అయితే ఆ కథలో కూడా కొన్ని డౌట్స్ ఉండటంతో ఎన్టీఆర్ రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో కొరటాల మరో కథను చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల నటీనటుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కొరటాల ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాను పూర్తిస్థాయిలో స్క్రిప్టు పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
ఇక అందులో బలమైన పాత్రల కోసం ప్రముఖ నటీనటులను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఒక సీనియర్ హీరోయిన్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు విజయశాంతి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో కలిసి నటించిన విజయశాంతి కొన్నాళ్లకు రాజకీయాల్లో బిజీగా మారిపోయింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు. చివరిగా మహేష్ బాబు నటించిన ‘ సరిలేరు నీకెవ్వరు ‘ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు.
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒకప్పటి హీరోయిన్…

అది కూడా తన క్యారెక్టర్ నచ్చినందుకే సినిమా చేసినట్లు ఆమె చెప్పారు.కానీ ఎక్కువగా మాత్రం సినిమాలు చేయనని పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని అన్నారు. ‘ సరిలేరు నీకెవరు ‘ సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చిన విజయశాంతి ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు కొరటాల ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా కోసం ఆమె సంప్రదించినట్లు సమాచారం. ఇక విజయశాంతి ఆ పాత్ర చేయడానికి స్క్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. కానీ కొరటాల మాత్రం తను అనుకున్న పాత్రకు విజయశాంతి అయితేనే బాగుంటుందని నిర్మాతలతో చర్చించినట్టు తెలుస్తుంది. మరి విజయశాంతి ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుందో లేదో చూడాలి.