Pavan Kalyan : మన పవన్ స్టార్ తెలుగు ఇండస్ట్రీ లోనే మంచి క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ తనకోసం అభిమానుల ప్రాణాలైనా ఇస్తారు. తను ఇప్పుడు ఒక పక్క పార్టీ తో బిజీగా ఉన్నా గాని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. మామూలుగా హీరోల అభిమానుల లలో మధ్య ఈర్షలు కొన్ని గొడవలు ఉంటాయి .కానీ హీరోలు అలా ఉండరు. ఎవరైనా చక్కగా ఎక్కడ కలిసిన సినిమాల గురించి మాట్లాడుకుంటారు సినిమాలు నువ్వు చేసిన సినిమా చాలా బాగుంది. నువ్వు చేసిన సినిమాలు చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు.
హీరోల మధ్య పొగరు అసూయ లేకుండా ఒకరి కి ఒకరు మద్దతు ఇచ్చుకుంటారు. ఇలాంటి వాటిలో ఫస్ట్ వస్తాడు కొలివుడ్ కు చెందిన శివకార్తికేయన్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ లోనే తనకి క్రేజ్ ఎక్కువగానే ఉంది. అందరు స్టార్ నటుల తో పాటుగా తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. కొలియడ్ సినిమాలో శివ కార్తికేయన్ తను అన్ని సినిమాలకు తనే డబ్బింగ్ ఇస్తూ అభిమానులు గుండెల్లోకి దూసుకెళ్తూ ఉంటాడు. మన ఇండస్ట్రీలో శివకార్తికేయన్ మంచి హిట్ కూడా కొట్టారు. ఇటీవల గురువారం హైదరాబాదులో ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కూతురు జాన్వి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి శివ కార్తికేయన్ కూడా వచ్చారు.
Pavan kalyan : ఫాన్స్ కి కనుల పండగే.

ఈ వివాహ వేడుకలో పవన్ కళ్యాణ్ మరియు శివకార్తికేయన్ కలిసి సంభాషించిన సంభాషణలు సోషల్ మీడియాలో బాగా చెక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోలలో శివ కార్తికేయన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నవ్వుతూ ఉన్న వీడియోలు చూసి ఇద్దరు ఫ్యాన్స్ సంతోషంతో హంగామా చేస్తున్నారు. ఈ పెళ్లి లో ఇంకా చాలా మంది తెలుగు సినీ నటులు తెగ హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ , నాగార్జున , చిరంజీవి , బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, ఇలా చాలా మంది ఈ వివాహ వేడుకలో పాల్గొని హంగామా చేశారు. వీళ్ళందరూ చక్కగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుతూ మంచి సందడి చేశారు.