Jabaradasth varsha : వర్ష అంటే తెలియని వారు లేనంతగా అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. వర్ష – ఇమాన్యుయల్ జంటగా అందరినీ ఇంకా ఎంతో అలరించి అందరి మనసుల్లో నిలిచిపోయారు. బుల్లితెర మీద కనిపించి అందరినీ తన నటనతో ఆకట్టుకునేది వర్ష , తన సోషల్ మీడియాలో ఎక్కువగా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే కుర్రకారు మతి పోవాల్సిందే. వర్ష ట్రెండీగానూ, ట్రెడిషనల్ గానూ, హాట్ గానూ సినీ తారలకు ఏమాత్రం తక్కువగా కానట్టు తన అందాలను ప్రదర్శిస్తుంది. తను ఏ పాత్రలోనైనా చక్కగా ఇమిడిపోతుంది. వర్ష కొన్ని సినిమాలలో కూడా నటించింది, కానీ సినిమాల ద్వారా తనకు అంతగా పేరు రాలేదు.
దాంతో నిరాశపడకుండా బుల్లితెరలో తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. అలా తను బుల్లితెరలో ప్రసారం అయ్యే ” ప్రేమ ఎంత మధురం ” సీరియల్ లో “మాన్సీ” క్యారెక్టర్ తో చాలా పేరు తెచ్చుకుంది. ఆ సీరియల్ లో రిచ్ గానూ, తన కామెడీతోను, ఎంతో ఒదిగిపోయింది. ఆ క్యారెక్టర్ లో కూడా తను అందంగా ఫ్యామిలీ చూసే విధంగా ట్రెడిషనల్ అలాగే ట్రెండీగా కనిపించి అందరినీ అలరించింది. అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం, వంటి సీరియల్స్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. వర్ష ఆ ప్రోగ్రామ్ లో అనసూయ, రష్మీలకు సరిసమానంగా అందంగా అలరిస్తుంది.
Jabaradasth varsha : బుల్లితెర నటి వర్ష గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

జబర్దస్త్ ప్రోగ్రామ్ లో తన నటన, అమాయకత్వం, కామెడి టైమింగ్ అన్నీ బాగా చేసేది. అంతేకాకుండా వర్ష – ఇమ్మాన్యుయల్ తో నటించడం తనతో ని రొమాంటిక్ గా యాక్ట్ చేయడంతో వర్ష – ఇమాన్యుయల్ జంట ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఒకప్పుడు రష్మి – సుధీర్ కి ఉన్న క్రేజ్ ఇప్పుడు వర్ష – ఇమ్యాన్యూయల్ సంపాదించుకున్నారు. వర్ష అసలు ఊరు మండపేట, 1994 డిసెంబర్ 25 న జన్మించింది. ముందు రాములమ్మ సీరియల్ లో నటించింది, తను డిగ్రీ పూర్తి చేసింది. తన తండ్రి , తల్లి తన సొంత ఊరు మండపేటలో ఉంటారు. వర్షకి మోడలింగ్ అంటే చాలా ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చింది. అలా వచ్చిన వర్షకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా తన నటనను నిరూపించుకుంది. వర్ష కి ఇలా ఎన్నో అవకాశాలు వచ్చి ఇంకా మంచి గుర్తింపును పొందాలి అని కోరుకుందాం.