Health Tips : ఈ తరం వారి జీవన విధానం చాలా మారిపోయింది. రుచుల కోసమని పోషకాలు లేని వివిధ రకాల ఆహార పదార్ధాలను తింటున్నారు. ఇలా తినడం వలన సరిగ్గా జీర్ణం అవ్వక అనేక రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా, ఈ ఆహార పదార్ధాల నుంచి ఎటువంటి శక్తి బాడీని చేరుకోవడం లేదు. అయిన ప్రజలు ఇలాంటి ఆహార పదార్దాలనే తింటున్నారు. వారంతట వారే తమ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవారు ఇలాంటి ఆహార పదార్ధాలను తింటే శారీరకంగా, మానసికంగా బలహీనుల అవుతున్నారు. అయితే స్ర్తీల వయసును మూడు రకాలుగా లెక్కించవచ్చు. మొదటిది అప్పుడే రుతుక్రమం మొదలైన ఆడపిల్లలు, రెండవది వివాహం అయ్యి గర్భం దాల్చిన స్ర్తీలు, మూడవది వయస్సు పైబడిన స్ర్తీలు. ఇప్పుడు వీరు ఎటువంటి ఆహార నియమాలను పాటించాలో తెలుసుకుందాం…
ముందుగా 11,12 సంవత్సరాల ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు. ఈ సమయంలోనే పిల్లల ఎదుగుదల శారీరకంగా, మానసికంగా మార్పు చెందుతుంది. ఈ వయసు పిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలంటే వాళ్లకి విటమిన్ డి సరిపోను ఉందో లేదో చూసుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్నవారికి ట్యాబ్లెట్స్ వేయాలి. వీళ్లు భోజనం చేసాక ఒక నువ్వుల ఉండను ఇవ్వాలి. ఆకుకూరలను, పప్పులను ఆహారంగా పెట్టాలి. పిల్లలకు తెలివితేటలు రావాలంటే గుమ్మడిగింజలను, పచ్చికొబ్బరిను ఏదో ఒక రూపంలో ఆహారంలో అందించాలి. అలాగే వీరి జీవన విధానంలో కూడా మార్పు రావాలి. ఈ వయసు ఆడపిల్లలు తెల్లవారుజామున లేవడం మంచిది. అలాగే ఈ వయసు పిల్లలు స్కూల్ లేదా కాలేజి నుంచి వచ్చాక ఒక గంట బయట ఆడుకోవాలి. ఇలా చేయడం వలన శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు.
Health Tips : ఆడవాళ్లు ఈ ఉండలను తిన్నారంటే చాలా బలంగా ఉంటారు.

రెండవది గర్భం దాల్చిన స్ర్తీలు. ఈ వయసులో వీరికి కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీరు బలమైన ఆహారాన్నితీసుకోవాలి. ఎక్కువగా వ్యాయామాలు చేయాలి. ఆహారాన్ని రెండింతలు తీసుకోవాలి. కనుక వీరు పోషకాలు ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి. మూడవది వయసు పైబడిన వారు. వీరికి ఈ వయసులో కాల్షియం తక్కువగా ఉండి బోన్స్ ప్రొబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్ధాలను తీసుకోవాలి. వీరు రోజుకొక నువ్వుల ఉండను తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.అలాగే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అందుకే రోజు ఒక గంట బయట తిరిగేలా చూసుకోవాలి.దీనివలన ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి