Sudigali Sudheer : సుధీర్ 1987 మే 19 న ఆంధ్రప్రదేశ్ లొని పశ్చిమగోదావరి జిల్లా కలింగపాలెం లో జన్మించాడు.సుధీర్ కి తమ్ముడు రోహన్, అక్క శ్వేత ఉన్నారు. 16 ఏళ్ల వయసులో సినిమాల్లో ట్రై చేద్దామని హైద్రాబాద్ కి వచ్చిన సుధీర్ డబ్బులు అడిగితే ఇవ్వడానికి ఏమీ లేదని, సపోర్ట్ కూడా లేదని, ఏమి చేయాలో తెలియక తిరిగి ఊరికి వెళ్లి పోయాడు. ఏదో ఒకటి చేద్దాం అని అనుకునే లోపే తండ్రికి యాక్సిడెంట్ అయ్యి కాలికి ఫ్రాక్చర్ అవ్వడంతో కాలుకి రాడ్ వేశారు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో పదిహేడు ఏళ్ల వయసులో ఉన్న సుధీర్ కి ఏదైనా చేయాలని హైద్రాబాద్ కి రావాలని ఫిక్స్ అయ్యాడు, అలా ఇంటి నుండి వచ్చిన సుధీర్ రెండు సంవత్సరాలు రామోజీ ఫిల్మ్ సిటీ లో జాబ్ చేశాడు, అక్కడ మెజీషియన్ గా పనిచేసేవాడు.
సుధీర్ ఐదవ తరగతి చదువుతున్నప్పటినుంచీ వాళ్ళ మామయ్య దగ్గర మ్యాజిక్ చెయ్యడం నేర్చుకున్నాడు. అది సుధీర్కి ఎంతగానో ఉపయోగపడింది. రెండు సంవత్సరాల తర్వాత జీతం ముప్పై వేలు అయ్యింది.నాకు అదే లోకం అయిపోయింది దానికి మించి చూడలేకపోతున్నా అనే ఫీలింగ్ సుధీర్ ని తొలచివేసింది అంటూ డబ్బులు వస్తున్నాయి కానీ సూపర్ ఏమీ కాదు, ఖర్చులకు మాత్రమే సరిపోతున్నాయి ఇతర సేవింగ్స్ ఏమీ లేవు. ఇక్కడి నుంచి బయటకు వచ్చి సొంతంగా మ్యాజిక్ షో మొదలు పెడదామని జాబ్ ని వదులుకున్నాడు. అక్కడి నుంచి సుధీర్ కి నిజమైన కష్టాలు మొదలయ్యాయి. జాబ్ మానేసిన తర్వాత సుధీర్ విపరీతంగా కష్టాలు పడ్డాడు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు.

ఎస్ ఆర్ నగర్ లో ఫ్రెండ్స్ దగ్గర ఉండి, అక్కడ ఒక మెజీషియన్ దగ్గర పనిచేసేవాడు. ఒక్కొక్క నెల ప్రోగ్రామ్స్ ఉండేవి, ఒక్కొక్కసారి ప్రోగ్రామ్స్ ఉండకపోవడం, కొన్నిసార్లు వాటర్ క్యాన్ కూడా కొనడానికి డబ్బులు లేక సింక్ లో వచ్చే నీళ్లు త్రాగేవాడు. ప్రియా పికిల్స్ ప్యాకెట్ తెచ్చుకొని పచ్చడి తినేవాడిని అని ఎన్నోసార్లు బాధపడ్డాడు సుధీర్, ఎన్నోసార్లు ఏడ్చాడు కూడా. అలా ఎన్నో కష్టాలు పడ్డ వాళ్లందరికీ ఈటీవీ జబర్దస్త్ షో ఒక వరం అని చెప్పవచ్చు, ఇలా ఉన్నారు అని చెప్పాలంటే దానికి కారణం జబర్దస్త్ అని చెప్పవచ్చు. 2013 నుంచి నిరాటంకంగా జబర్దస్త్ షోలో ఉన్నాడు సుధీర్ మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన సుధీర్ రెండు సంవత్సరాల తర్వాత తానే టీమ్ లీడర్ అయ్యాడు.
ఆ తర్వాత గెటప్ శ్రీను,సన్నీ, ఆటో రాంప్రసాద్ సహాయంతో టాప్ గా నిలిచాడు, వీళ్ళ టీమ్ ఒక బ్రాండ్ గా మారింది. పోవే పోరా షో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. షోలు పెరగడం, యాంకరింగ్ మొదలుపెట్టడం, ఈవెంట్ కూడా చేయడంతో పాటు సుధీర్ లైఫ్ మారిపోయింది. ఇవే కాకుండా సినిమాల్లో కూడా నటించాడు సుధీర్ అడ్డా, సెల్ఫీరాజా, రేసు గుర్రం, సుప్రీమ్, నేను శైలజా, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఎన్నో సినిమాల్లో కూడా నటించాడు. ఇలా ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా నిజాయితీగా ఉండి, ఎన్నో కష్టాలు పడి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు సుడిగాలి సుధీర్.