Suma Kanakala : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సుమ కనకాల గురించి అందరికీ తెలుసు. ఇక సుమ కేరళ అమ్మాయి అయినప్పటికీ అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ అచ్చంటి తెలుగు అమ్మాయి అనిపించుకుంది. అయితే తాజాగా సుమా కనకాల మీడియాకు క్షమాపణ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు సుమ ఓ వీడియోను కూడా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు…ఇటీవల ఓ ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించాయని నాకు అర్థం అవుతుంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా.
మీరు ఎంత కష్టపడి పని చేస్తారో నాకు తెలుసు. మీరు నేను కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం. నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా భావించి క్షమిస్తారని కోరుకుంటున్నా అంటూ సుమ వీడియోని షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు విషయానికొస్తే….. తాజాగా ఆదికేశవ సినిమాలోని “లీలమ్మో ” పాటను చిత్ర బంధం తాజాగా బుధవారం సాయంత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించడం జరిగింది. ఇక ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతూ మీడియా వారు స్నాక్స్ ను భోజనంలా తింటున్నారని సరదాగా సుమ వ్యాఖ్యానించింది.
ఇక దానిని సీరియస్ గా తీసుకున్న మీడియా మిత్రుల లో ఒకరు మీరు అలా అనకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయ వ్యక్తం చేశారు. మీడియా వారు తనతో ఎంతో కాలంగా ప్రయాణిస్తున్నారని ఆ చనువుతోనే నేను సరదాగా మాట్లాడానని సుమా సమాధానం ఇచ్చారు. అలాగే మీరు స్నాక్స్ ను స్నాక్స్ లాగనే తిన్నారు ఓకేనా అంటూ సుమ అనగా…ఇదే వద్దనేది మీ యాంకరింగ్ అంటే అందరికీ ఇష్టమే కానీ మీడియా వాళ్లతో ఇలాంటివి వద్దు అంటూ సదరు విలేకరి ఘటుగా స్పందించారు. ఇక ఈ విషయానికి అప్పుడే వేదికపై క్షమాపణలు కోరిన సుమ మళ్లీ తాజాగా ఓ వీడియోతో విలేకరులకు క్షమాపణలు చెప్పింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీడియా మిత్రులకు సారీ చెప్పిన Suma Kanakala గారు ????#sumakanakala pic.twitter.com/8I9pUVUMmH
— Kiran Mahesh (@kiranmahesh026) October 25, 2023
Words War Between Film Journalist and Anchor #Suma At #Aadikeshava Song Launch event pic.twitter.com/nf6Ld5GO8R
— Tollywood insights (@Tollywoodinsigh) October 25, 2023