Chhattisgarh : రైల్వేలో పది నెలల పాపకు ఉద్యోగం, 18 సంవత్సరాలు రాగానే డైరెక్ట్ గా జాబ్ లోకి – ఇది ఎలా సాధ్యం.

Chhattisgarh : పది నెలల పాపకు రైల్వేలో ఉద్యోగం రావటం ఏమిటి అని అనుకుంటున్నారా ఇది నిజమే. చత్తీస్గడ్ లోని ఒక చిన్న పాపకు ఈ అవకాశం దక్కింది. అంతేకాకుండా ఇండియన్ రైల్వేలో ఉద్యోగం ఇవ్వటం మరియు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం, 18 సంవత్సరాలు నిండగానే డైరెక్ట్ గా ఆమె వెళ్లి జాబులో జాయిన్ కావచ్చు అని అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఆ పాప వేలిముద్రలు సేకరించి ఆ పాప పేరును రైల్వే రికార్డ్స్ లో అధికారికంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు.

ఇలా పది నెలల పాపకు జాబ్ ఇవ్వడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఒక రైల్వే ఉద్యోగి జూన్ 1న రోడ్ యాక్సిడెంట్లో ఆ పాప తల్లిదండ్రులు మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని ఆ పాప తండ్రి రాజేంద్ర కుమార్ భిలాయిలోని రైల్వే యాక్సిడెంట్ లోనీ భిలాయి యార్డులో అసిస్టెంట్ గా పని చేస్తూ ఉండేవారు.రోడ్డు ప్రమాదంలో ఇరువురు మరణించగా అదృష్టవశాత్తు పాప ప్రాణాలతో బయటపడింది.

Chhattisgarh : రైల్వేలో పది నెలల పాపకు ఉద్యోగం-ఇది ఎలా సాధ్యం.

ten month old baby gets a job in the indian railways
ten month old baby gets a job in the indian railways

అయితే రాయపూర్ రైల్వే డివిజన్ లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిబ్బంది సెక్షన్లో ఈ పాపకు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. జులై 4న రైల్వే రిక్రూట్మెంట్ వారు అధికారిక ప్రకటనను జారీ చేశారు. దీనిని కారుణ్య నియ్యమకం అంటారు. రైల్వేలో పనిచేస్తున్న తల్లి లేదా తండ్రి ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకి వంశపారపర్యంగా ఈ జాబు ఇవ్వటం జరుగుతుంది. మరణించిన లేదా ఏదైనా వైద్య కారణాలవల్ల మధ్యలో రిటైర్ అయిన వారిపై ఆధారపడిన వారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

ఆర్థికంగా కుటుంబాలు చితికి పోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వేసులు బాటుని ప్రభుత్వం కల్పించడం జరిగింది. మృతి చెందిన లేక వైద్య కారణాల వల్ల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారి వారసులకు ఈ కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. కాకుండా ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆరు సంవత్సరాలు కనిపించకుండా పోయిన ఇలాంటి ఉద్యోగాలు మిస్సింగ్ కేస్ కింద కారుణ్య నియామకాలు చేయడం జరుగుతుంది. ఈ నియామకానికి మిస్సింగ్ అయినట్లయితే మిస్సింగ్ కేసుకు సంబంధించిన పోలీస్ రిపోర్టు సబ్మిట్ చేయాల్సి వస్తుంది.