Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో టెంప్ట్ చేస్తున్న ఆఫర్లు.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Amazon Great Indian Festival Sale : ఇది పండుగల సీజన్. దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2022 సేల్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. నిజానికి సెప్టెంబర్ 23న ఈ సేల్ ప్రారంభం అవుతుంది. కానీ.. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు మాత్రం ఈ సేల్ సెప్టెంబర్ 22నే ప్రారంభం కానుంది. పండుగల సందర్భంగా వస్తున్న సేల్ కావడం వల్ల.. ఈ సేల్ లో పలు రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ అందించబోతోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ సెప్టెంబర్ 21న అర్ధరాత్రి 12 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మిగితా యూజర్లు మాత్రం సెప్టెంబర్ 22 న అర్ధరాత్రి 12 నుంచి ఈ సేల్ కు యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే.. ఈ సేల్ కు చివరి తేదీ ఏంటని మాత్రం అమెజాన్ ఇంకా చెప్పలేదు.

amazon great indian festival 2022 sale to start from 22 september 2022
amazon great indian festival 2022 sale to start from 22 september 2022

ఈ సేల్ లో భాగంగా సెలెక్ట్ చేసిన కొన్ని వస్తువుల మీద ప్రత్యేకమైన లైటెనింగ్ డీల్స్ ఉండనున్నాయి. పలు డిస్కౌంట్లు, ఆఫర్లను ఈ సేల్ కోసమే అమెజాన్ తీసుకురానుంది. అలాగే.. ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎస్బీఐ కార్డు ద్వారా ఈ సేల్ లో వస్తువులను కొనుగోలు చేసేవారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పాపులర్ మొబైల్స్, యాక్సెసరీస్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

Amazon Great Indian Festival Sale : లాప్ టాప్స్, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్స్ మీద 75 శాతం వరకు డిస్కౌంట్

ఇక.. మొబైల్ ఫోన్స్ తో పాటు పాపులర్ లాప్ టాప్స్, స్మార్ట్ వాచెస్, ఇతర ఎలక్ట్రానిక్స్ మీద 75 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఎక్స్ ఛేంజ్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా ఈ సేల్ లో లభించనున్నాయి. ఈ సేల్ లో కూపన్ ఆధారిత డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి. కొత్త టీవీ కొనాలనుకున్నా, ఇతర హోమ్ అప్లయెన్సెస్ కొనాలనుకున్నా తక్కువ ధరల్లో ఈ సేల్ లో కొనుగోలు చేయొచ్చు. ఇంకా.. ఫైర్ టీవీ స్టిక్ మోడల్స్, కిండిల్ ఈబుక్ రీడర్స్, అలెక్సా పవర్డ్ ఈకో స్మార్ట్ స్పీకర్స్ కూడా ఈ సేల్ లో డిస్కౌంట్ రేట్లలో అందుబాటులో ఉండనున్నాయి.