Udayabhanu : బుల్లితెరలో బిగ్ బాస్ కి క్రేజ్ మామూలుగా లేదు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ వస్తుందా అని ఎదురు చూశారు. ఎంతో ఆశగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలైంది. బిగ్ బాస్ అంటేనే అరుపులు, కేకలు. దానికి ఏమాత్రం తగ్గకుండా ముందుగానే ప్రిపేర్ గా వచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎవరికైనా ఈ విషయం బాగా అర్థమవుతుంది. అవసరం ఉన్నా లేకున్నా గొడవలు పెట్టుకునే కంటెస్టెంట్స్, ఆ వంకతో ఓదార్చే అబ్బాయిలు, ఇవన్నీ ఎడిటర్ బాగా గమనిస్తాడు.
అందుకే జనాలకి ఏ విధంగా అర్థం కావాలో అలాగే కట్ చేసి ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తారు. దీంతో బిగ్ బాస్ టిఆర్ పి రేటింగ్ బాగా పెరిగిపోతుంది. అయితే సీజన్ సిక్స్ మొదలవుతుంది అని తెలిసి నప్పటినుంచి సోషల్ మీడియాలో యాంకర్ ఉదయభాను పేరు ఎక్కువగా వినిపించింది. హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా ఈమె పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగింది. హౌస్ లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఉదయభాను తీసుకుంటుందని దీనికోసం ఆమె క్రేజీ కండిషన్స్ పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఉదయభాను రాలేదు. అదేంటి అంత పాపులారిటీ ఉన్న అంత బాగా వినిపించిన నీ పేరు ఎందుకు హౌస్ లోకి రాలేదు అనుకుంటున్నారు ప్రేక్షకులు.
Udayabhanu : ఆపింది ఆ హీరోనేనట…

అయితే దానికి కారణం నాగార్జున అని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఉదయభాను రాకుండా ఆపింది నాగార్జున నేనట. దానికి కారణం ఆయనకు ఆమెకు గతంలో ఉన్న విభేదాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున చేయాల్సింది కాదట. మరో హీరో చేయాల్సి ఉంది కానీ చివర్లో ఆ హీరో రానని చెప్పడంతో నాగార్జున తెరపైకి వచ్చారు. కరెక్ట్ గా అదే టైంలో ఉదయభాను బిగ్ బాస్ రిజెక్ట్ చేయడం అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోకుండా ఉదయభానుని హోల్డ్ లో పెట్టినప్పుడే ఈ విషయం ఉదయభాను కు అర్థమైందంట. దీంతో ఉదయభాను బిగ్ బాస్ లోకి రానీయకుండా ఆపింది నాగార్జున అని అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.